DailyDose

మీ ఇంట్లో ఉన్నది అటాచ్డ్ బాత్ రూమా?

మీ ఇంట్లో ఉన్నది అటాచ్డ్ బాత్ రూమా?

మనం నిత్యజీవితంలో ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. అందుకే వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి పునాది నుంచి బాత్ రూమ్ వరకు అనేక నియమ నిబంధనలు పాటిస్తూ ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేయాలి. ఇప్పుడు అన్ని ఇళ్లల్లో అటాచ్డ్ బాత్ రూమ్స్ రావడం సహజమైంది. అయితే బాత్ రూమ్ లో తెలిసో తెలియకో పొరపాట్లు చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో దీనివల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం ఎక్కువ మంది తమ ఇళ్లల్లో అటాచ్డ్ బాత్ రూమ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. నివసించే గదికి అనుబంధంగా ఉంటుంది. అయితే గదికి అనుబంధంగా ఉంటుంది కాబట్టి అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

బాత్ రూమ్ కు లైట్ కలర్ గాలి, నీరు, అగ్ని వంటి వాటిని బ్యాలెన్స్ చేస్తూ సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలి. మీ ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుందని మీరు అనుకుంటే కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం, శాంతి పెరుగుతుంది. అటాచ్డ్ బాత్ రూమ్స్ ఎలా ఉండాలి? పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి? బాత్ రూమ్కు సంబంధించిన కొన్ని వాస్తు చిట్కాలను మనం తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం, భార్యభర్తల సంబంధాలపై ప్రభావం చూపేది అటాచ్డ్ బాత్ రూమే. భార్యాభర్తలిద్దరూ కలిసి నిద్రపోయేటప్పుడు పాదాలు బాత్ రూమ్ వైపు పెట్టకూడదు. ఒకవేళ అలా కాళ్లు వేసి పడుకుంటే దాంపత్య జీవితంలో గొడవలు పెరిగే అవకాశం ఉందని బాత్ రూమ్ కు వేసే రంగు కూడా లైట్ కలర్ ఉండాలి. గోధుమ రంగు, తెలుపు రంగులు బాత్ రూమ్స్ కు సరిగ్గా సరిపోతాయి.

నిద్రించడానికి ముందే బాత్ రూమ్ తలుపు మూసేయాలి నిద్రించడానికి ముందు బాత్ రూమ్ తలుపును తప్పనిసరిగా మూసివుంచాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా చేయకపోయినా ఆలుమగల దాంపత్య జీవితంలో గొడవలు పెరుగుతాయి. అంతేకాదు.. మీ ఆర్థిక స్థితిని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి పడుకునే ముందు బాత్ రూమ్ తలుపులు మూసేయాలి. నీలిరంగు బకెట్, టబ్ ఉండేలా చూసుకోండి. దీనివల్ల అన్నీ శుభఫలితాలే ఎదురవుతాయి. నలుపు, ఎరుపు రంగుల బకెట్లు లేదంటే టబ్ లను ఉపయోగించొద్దు. మనలో ఎక్కువమంది అటాచ్డ్ బాత్ రూమ్స్ లో తెలిసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తున్నప్పటికీ వాస్తుదోషాలను తొలగించేందుకు బాత్ రూమ్ లో ఎపపుడూ ఒక గాజు గిన్నెను ఉంచి అందులో రాళ్ల ఉప్పుతో నింపండి. ప్రతివారం ఈ నీళ్లను మారుస్తూ ఉండాలి. దీనివల్ల సానుకూల ఫలితాలు రావడం ప్రారంభిస్తాయి. బాత్ రూమ్ లో నీరు లీక్ కాకుండా చూసుకోవాలి.

పంపులపై తడిబట్టలు ఉండకూడదు

తడిబట్టలను పంపులపై ఉంచొద్దు. తడి బట్టలు బాత్ రూమ్ లో ఉండటంవల్ల వాస్త దోషాలు పెరిగే అవకాశం ఉంటుంది. బాత్రూమ్స్ లో ఎక్కు సమయం నానబెట్టిన బట్టలను ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, టాయిలెట్ సీటును ఎల్లప్పుడూ మూసే ఉంచాలి. ఒకవేళ పొరపాటును ఆ సీటును తెరిచి ఉంచితే, మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉండటంతోపాటు ఆర్థిక నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. వాడిన తర్వాత టాయిలెట్ సీటు ఎప్పటికీ మూసే ఉంచాలని గుర్తుంచుకోండి.