తిరుమలలో దాదాపు 60 ఏళ్ల క్రితం నిర్మించిన సత్రాలను పూర్తిస్థాయిలో తొలగించి వాటి స్థానంలో నూతన నిర్మాణాలు చేపట్టేదిశగా టీటీడీ ఆలోచన చేస్తోంది. అధునాతన సౌకర్యాలతో వీటిని నిర్మించేలా ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం తిరుమలపై దాదాపు 7,500 గదులున్నాయి. వీటిలో 30 నుంచి 60 ఏళ్ల కిందట నిర్మించిన కట్టడాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్లుగా అనేక కాటేజీలకు రూ.కోట్ల వ్యయంతో మరమ్మతులు చేస్తున్నారు. అన్నింటిలోనూ గీజర్లు, టైల్స్, లీకేజీలు లేకుండా మరమ్మతులు చేస్తున్నారు. అదేసమయంలో దాదాపు 60 ఏళ్ల క్రితం నిర్మించిన సుదర్శన్, గోవర్థన్, కల్యాణి సత్రాలను కూడా దశలవారీగా మరమ్మతులు చేస్తూ వచ్చారు. అయితే నిర్మాణం జరిగి చాలా కాలమైన నేపథ్యంలో నిత్యం వీటిలో లీకేజీలు, చిన్నపాటి సమస్యలు వెలుగుచ ూస్తున్నాయి. సుదర్శన్‌లో 386, గోవర్థన్లో 186, కళ్యాణిలో 260 గదులు ఉన్నాయి. వీటిని సామాన్య భక్తులకే కేటాయిస్తున్నారు. వీటిలో తరచ ుగా సమస్యలు వెలుగు చూస్తుం డడంతో టీటీడీ అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నిర్మాణాలను పూర్తిగా తొలగించి.. వాటి స్థానంలో అధునాతన వసతులతో కొత్త నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నారు. అయితే, ఒకేసారి అన్నింటినీ తొలగిస్తే గదులకు కొరత ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో ఒక్కో సత్రాన్ని కూలగొట్టి కొత్తవాటిని నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతి సత్రంలోనూ కార్ ప్కారింగ్, కల్యాణకట్ట, ఏసీ, నాన్ ఏసీ గదులు, గీజర్లు వంటి సదుపాయాలను కల్పించనున్నారు. త్వరలోనే ఈ అంశంపై నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించనున్నట్టు తెలిసింది.