🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 *11.03.2023 ✍🏻*
🗓 *నేటి రాశి ఫలాలు 🗓*
🐐 మేషం
ఈరోజు (11-03-2023)
ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో శ్రమకు తగిన ఫలితాలొస్తాయి. అయితే మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. అప్పుడే మీరు విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో కొత్త తాజాదనం ఉంటుంది. ఈరోజు కొన్ని శుభకార్యాలు కూడా చేస్తారు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఈరోజు కొన్ని అసంపూర్తిగా ఉన్న కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (11-03-2023)
ఈ రాశి వారు ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు పొందుతారు. ఈ కారణంగా మీ పనులన్నీ సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు పాత అప్పుల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (11-03-2023)
ఈ రాశి వారు ఈరోజు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అపార్థాల కారణంగా, మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఈరోజు మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీరు ఈరోజు ఖర్చులను నియంత్రించుకోవాలి. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడానికి ఈరోజు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (11-03-2023)
ఈ రాశి వారిలో యువత ఈరోజు మీ పనులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అప్పుడే మీరు లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. మీ పిల్లల కెరీర్‌కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. వ్యాపారులు ఈరోజు ఏదైనా ప్లాన్ చేసుకునేందుకు నిపుణుల సలహ అవసరం. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (11-03-2023)
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు ఎక్కువగా షాపింగ్ చేయొచ్చు. మీ కుటుంబ బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తిస్తారు. మీరు ఈరోజు సంతోషంగా ఉంటారు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మీరు చేసే పనిని చాలా నిజాయితీగా చేయాలి. మీరు సోమరితనాన్ని వదిలేయాలి.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (11-03-2023)
ఈ రాశి వారు ఈరోజు ప్రతి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో టీచర్లు, కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. వ్యాపారులు వేగవంతమైన మార్పులు చేసుకుంటారు. ఈరోజు మీరు మరింత కష్టపడాలి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మరోవైపు మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి.
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (11-03-2023)
ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనవసరమైన లావాదేవీలకు దూరంగా ఉండాలి. అన్ని సమస్యలను సహనంతో అధిగమిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు ఎలాంటి ప్రాజెక్టులనైనా చాలా తేలికగా ఒత్తిడి లేకుండా పూర్తి చేస్తారు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (11-03-2023)
ఈ రాశి వారు ఈరోజు ఏదైనా కొత్త పని చేయాలంటే సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. దీంతో మీరు అనేక సమస్యల నుంచి పరిష్కారం పొందుతారు. మీ మానసిక పరిస్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ప్రియమైన స్నేహితులతో కొన్ని ఆనందకరమైన క్షణాలను గడపాలనుకుంటారు. మరోవైపు ఈరోజు మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (11-03-2023)
ఈ రాశి వారు ఈరోజు చాలా తెలివిగా పని చేయాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం కోసం ప్రయత్నించాలి. ఈరోజు మీరు పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఎవరికీ వాగ్దానాలు చేయొద్దు. మీ కెరీర్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీ ప్రాజెక్టును పూర్తి చేయడంలో సహోద్యోగులు సహాయం చేస్తారు.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (11-03-2023)
ఈ రాశి వారు ఈరోజు తోబుట్టువుల సహాయంతో పనులన్నీ పూర్తి చేస్తారు. ఈరోజు బయటి ఆహారాన్ని తినకూడదు. మీ ఆరోగ్యం క్షీణించొచ్చు. మీ జీవిత భాగస్వామి సలహా వల్ల మీ కుటుంబ వ్యాపారం ప్రభావవంతంగా మారుతుంది. ఈ కారణంగా మీ కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో గందరగోళం తొలగిపోతుంది. అయితే మీరు మీ లక్ష్యాన్ని సాధించడంలో మీరు విజయం సాధిస్తారు.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (11-03-2023)
ఈ రాశి వారిలో ఈరోజు రాజకీయాలతో సంబంధం ఉండే వారు సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవాలి. వ్యాపారులకు ఈరోజు సువర్ణావకాశం లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలను నియంత్రించాలి. మీరు స్నేహితులతో కలిసి ఆలయానికి తీర్థయాత్రకు వెళ్లొచ్చు.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (11-03-2023)
ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. వివాహితులు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీరు తల్లి ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. మీ ఆర్థిక పరిస్థితిని ద్రుష్టిలో ఉంచుకుని ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేదంటే పరిస్థితులు మరింత దిగజారొచ్చు.
🦈🦈🦈🦈🦈🦈🦈