ఈనెల 13న జరిగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు, ఫోర్జరీలకు వైసీపీ తెరలేపిందని ఆరోపించారు. దొంగ అడ్రస్‌లు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి నిరక్షరాస్యులను పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేశారన్నారు చంద్రబాబు.