ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఎంత క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా విడుదల కన్నా ముందు నుంచే ఈ సాంగ్ దేశాన్ని ఓ ఊపు ఉపేసింది. ఇక ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల బరిలో పోటీ పడుతోంది. అక్కడ కూడా నాటు నాటు పాట దుమ్ము రేపుతోంది. ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా వ్యాఖ్యత జిమ్మి మాట్లాడుతుండగానే కొందరు ఇంగ్లీష్ డ్యాన్సర్స్ వచ్చి నాటు నాటు స్టెప్పులేశారు. అలా నాటు నాటు పాటతోనే ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ప్రారంభం అవ్వడం విశేషం. ఇక ఆ తర్వాత లైవ్ పర్‌ఫామెన్స్‌లో భాగంగా.. సినిమాలో నాటు నాటు పాటని పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆస్కార్స్ స్టేజీ మీద పాడుతుండగా.. డ్యానర్స్ స్టెప్పులతో అదరగొట్టారు.
ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో ఈ పాటకు చరణ్, జూనియర్లు మాస్ స్టెప్పులతో అదరగొడితే.. ఇక తాజాగా లైవ్ పర్‌ఫామెన్స్‌లో కూడా నాటు నాటు పాట ఓ ఊపు ఊపింది. ఆస్కార్స్ వేదిక మీద ఈ పాట ప్రదర్శనకు స్టేజీ ఊగిపోయింది. ఎంత భారీ రెస్పాన్స్ వచ్చిందంటే.. ప్రదర్శన పూర్తయ్యేసరికి.. అక్కడున్న ప్రతి ఒక్కరు లేచి.. చప్పట్ల మోతతో తమ ప్రశంసలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఇక ఆస్కార్ అవార్డ్స్ 2023 వేడుకలు సోమవారం తెల్లవారుజామున ప్రారంభం అయ్యాయి. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ సందడి చేసింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, కీరవాణి, చంద్రబోస్ ప్రతి ఒక్కరు వేడుకకు హాజరయ్యారు. ఇక నాటు నాటు ఆస్కార్ అవార్డు గెలవాలని ప్రతి ఇండియన్ మూవీ లవర్ కోరుకుంటున్నాడు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.