WorldWonders

కీరవాణి, చంద్రబోస్ లు అయిదవ భారతీయులు

కీరవాణి, చంద్రబోస్ లు అయిదవ భారతీయులు

ఇంతకు ముందు కేవలం నలుగురు భారతీయులు మాత్రమే ఈ ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ఇప్పుడు తెలుగు వారు అయిన కీరవాణి, చంద్రబోస్ అయిదవ భారతీయులుగా ఈ అవార్డు అందుకున్న వారిగా చరిత్ర సృష్టించారు.

95 ఏళ్ల చరిత్ర కలిగిన ఆస్కార్ అవార్డ్స్ లో ఇంతకు ముందు కేవలం నలుగురు అంటే నలుగురికి ఈ అవార్డు వచ్చింది. ఇప్పుడు కీరవాణి, చంద్రబోస్ లు వాళ్ళ తరువాత అయిదవ వారు ఈ అవార్డు అందుకున్న వారిలో. వారిద్దరూ తెలుగు వారు అవటం, తెలుగు జాతికే ఒక గర్వకారణం. మార్చి 13, 2023 భారతదేశ సినిమా చరిత్రలో ఒక నూతన అధ్యాయం నెలకొంది. అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కూడా. ఈరోజు భారత దేశానికి గర్వపడే రోజు.

‘ఆర్.ఆర్.ఆర్’ ఆస్కార్ నామినేషన్ లో వున్న దగ్గర నుంచి అందరి దృష్టి ఈ ‘ఆర్.ఆర్.ఆర్’ పైనే వుంది. అయితే ఉత్తమ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నామినేషన్ లో ఉంటాడు అనుకుంటే, చివరికి ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో నామినేషలో చోటు సంపాదించింది. ఇక అప్పటి నుండి ఈ పాటకి ఆస్కార్ అవార్డు వస్తుంది అని అందరూ అనుకున్నారు. ప్రపంచం అంతా ఈ సినిమాకి దాసోహం అంది. దర్శకుడు రాజమౌళి ప్రతిభని మెచ్చుకుంది. ప్రపంచం లోని అత్యుత్తమ దర్శకులు అయిన స్టీవెన్ స్పెల్ బెర్గ్ , జేమ్స్ కామెరూన్ లాంటి వారే రాజమౌళి ని అతని సినిమాని మెచ్చుకున్నారు. ఇంతమంది మెచ్చుకున్నాక, ‘ఆర్.ఆర్.ఆర్’ కి ఆస్కార్ అవార్డు గ్యారంటీ అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఈసారి తెలుగువాడి జయకేతనం ఆస్కార్ లో వెలిగింది. మన తెలుగు, భారత పతాకం ఆస్కార్ లో ఎగిరింది. ఇంతకు ముందు భాను అతియా, రసూల్ పూకొట్టి, గుల్జార్, ఏ.ఆర్. రెహమాన్ ఈ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. 2009 లో సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ కి ‘జై హో’ సాంగ్ కి గాను ఆస్కార్ వచ్చింది. మళ్ళి ఇప్పుడు మన తెలుగు తేజాలు కీరవాణి, చంద్రబోస్ లు ఈ అవార్డును అందుకున్నారు.