NRI-NRT

ఢిల్లీ, బెంగళూరులలో పర్యటించనున్న యూకే వ్యాపారవేత్తల బృందం.. సారథిగా భారతీయుడు

ఢిల్లీ, బెంగళూరులలో పర్యటించనున్న యూకే వ్యాపారవేత్తల బృందం.. సారథిగా భారతీయుడు

యూకే – భారత్‌ల మధ్య బలమైన వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను ప్రోత్సహించేందుకు గాను లండన్‌కు చెందిన పది టెక్ కంపెనీల ప్రతినిధుల బృందం ఢిల్లీ, బెంగళూరు నగరాలలో పర్యటించనుంది.ఈ బృందానికి సారథిగా భారత సంతతికి చెందిన రాజేష్ అగర్వాల్ నేతృత్వం వహిస్తున్నారు.

ఈయన లండన్ డిప్యూటీ మేయర్ ఫర్ బిజినెస్‌గా విధులు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.ఈ బృందం సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనుంది.

ఇండోర్‌లో జన్మించిన అగర్వాల్.లండన్‌కు చెందిన ఫిన్‌టెక్ సంస్థలు RationalFx, Xendpay‌లకు వ్యవస్థాపకుడు.

లండన్‌ను(London) ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా ప్రోత్సహించేందుకు గాను రాజేష్ అగర్వాల్(Rajesh Agrawal ) నగర మేయర్ సాదిక్ ఖాన్(Sadiq khan) బృందంలో పనిచేస్తున్నారు.

లండన్‌కు చెందిన కంపెనీలు అంతర్జాతీయంగా అభివృద్ధి చెందడానికి 2019లో రూపొందించిన మేయర్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రోగ్రామ్ కింద రాజేష్ బృందం తొలిసారిగా భారత్‌కు వస్తోంది.అంతర్జాతీయంగా తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి భారతీయ నగరాలను సరైన లాంచ్‌ప్యాడ్‌గా లండన్‌ను చూస్తున్నాయని అగర్వాల్ స్పష్టం చేశారు.లండన్.

ముంబై, బెంగళూరు నగరాలు(Bengaluru) ఫైనాన్స్, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ వంటి రంగాల్లో పరస్పరం వృద్ధి చెందుతాయని ఆయన ఆకాంక్షించారు.ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలలో ఒకటిగా, ప్రతిష్టాత్మక లండన్ కంపెనీలకు భారత్ ప్రధాన మార్కెట్ అని రాజేష్ అన్నారు.

లండన్ బిజినెస్ గ్రోత్ ఏజెన్సీ, లండన్ అండ్ పార్ట్‌నర్స్ (ఎల్ అండ్ పీ) గణాంకాల ప్రకారం.అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని చూస్తున్న భారతీయ కంపెనీలకు అగ్రశ్రేణి నగరంగా, భారతీయ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) నంబర్‌వన్ యూరోపియన్ నగరంగా లండన్ నిలిచింది.సంబంధిత ఎఫ్‌డీఐ మార్కెట్ల పరిశోధన ప్రకారం.గడిచిన దశాబ్ధ కాలంలో లండన్ భారత్ నుంచి 174 ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్ట్‌లను ఆకర్షించింది.ఈ లిస్ట్‌లో సింగపూర్ (150), న్యూయార్క్( 53)లు కూడా లండన్ వెనుకే నిలిచాయి.అలాగే గత పదేళ్లుగా భారతీయ కంపెనీల పెట్టుబడులు లండన్ ఆర్ధిక వ్యవస్థకు బూస్టప్ ఇచ్చాయని మేయర్ కార్యాలయం తెలిపింది.

యూకే రాజధానిలో 7,853 అదనపు ఉద్యోగాల కల్పనకు భారతీయ ఎఫ్‌డీఐలు దారి తీశాయని వెల్లడించింది.భారతీయ ఐటీ దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్‌తో పాటు భారతీయ యానికార్న్స్ ‘‘అప్‌గ్రాడ్’’, ఓలా, ఓయో వంటి కంపెనీలు లండన్‌లో తమ కార్యకలాపాలను విస్తరించాయి.