*స్వీట్లు తింటే షుగర్ జబ్బు వస్తాదా?*
మనలో చాలామంది స్వీట్సు తింటే డయాబెటిస్ వస్తుంది.. కావున స్వీట్లు తినకూడదు అని అనడం గమనిస్తాము.. మరికొందరు ఇక షుగర్ జబ్బు వచ్చింది స్వీట్లు తినరాదు అనడం గమనిస్తాము.. కాని స్వీట్లు తినడం వలన షుగర్ జబ్బు రావడం అనేది ఒక అపోహ మాత్రమే,.. అలాగే షుగర్ పేషెంట్లు స్వీట్లు తినకపోవడం మంచిదే అయినా మరీ నోరుకట్టుకొని తినకపోవడం సాధ్యము కాకపోవచ్చు…
షుగర్ జబ్బు అనేది మనలో ఇన్సులిన్ ఉత్పత్తి సామర్ధ్యం తగ్గినపుడు షుగర్ యొక్క వినియోగం శరీరం సెల్సులో తగ్గడం వలన రక్తంలో చక్కెర మోతాదు పెరగడం ను డయాబెటిస్ అంటారు,.. కాని ఇది ఓ లక్షణం మాత్రమే,. ఇది మెల్లిగా పెద్ద ఎండోక్రైనల్ మరియు బయొలాజికల్ సమస్య అయి కూర్చుంటుంది,..
ఈ వ్యాధిలో అన్ని రకాల జీవక్రియల ఉల్లంఘించ బడతాది: మానవులలో కార్బోహైడ్రేట్, కొవ్వు, ప్రోటీన్, మినరల్ మరియు వాటర్-ఉప్పు ఇలా అన్ని జీవనక్రియలపై ప్రభావితం చూపుతాది…, దాహం పెరుగుతుంది, మీరు నిరంతరం త్రాగాలని కోరుకుంటారు, తరువాత మూత్రవిసర్జన పెరుగుతుంది, అలసిపోవడం, ఆకలి కలగడం, నోరు ఎండి పిడచకట్టడం సంభవిస్తాయి. ఒక వ్యక్తి బరువు కోల్పోతాడు లేదా, దానికి విరుద్ధంగా, బరువు పెరగవచ్చు. అలసట, తలనొప్పి కనిపిస్తుంది, నిద్ర చెదిరిపోతుంది. కళ్ళ రెటీనాపై ప్రభావం వలన అస్పష్టమైన దృష్టిలోపం రావడం గమనించవచ్చు.
ఆపై దీర్ఘకాలిక మూత్రపిండ వైఫల్యం, కంటి నాళాలకు తీవ్రమైన నష్టం, అంధత్వం, ఆంజినా పెక్టోరిస్, అథెరోస్క్లెరోసిస్ యొక్క వేగవంతమైన అభివృద్ధి, నపుంసకత్వము, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, చిత్తవైకల్యం, పాలీన్యూరోపతి, నెఫ్రోపతీ, కోమా,అలా వరుసగా శరీరం ఛిద్రమవుతుంది. డయాబెటిక్ ఫుట్ రాడం వలన కాళ్ళు ఆంప్యుటేషన్ చేయాల్సి రావడం చాలా సాధారణంగా సంభవిస్తుంది….
స్వీట్లు తినడానికి దీనికి పెద్దగా సంబంధం లేదు. నా ఉద్దేశ్యం లో – చక్కెర నియంత్రణలో ఉంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా స్వీట్లు తీసుకోవచ్చు.
ఒక వ్యక్తి తన జీవితమంతా స్వీట్లకు దూరంగా ఉంటే, అది అతనిని మధుమేహం రాకుండా రక్షించదు. జీవితాంతం స్వీట్లు తినే వారు, తినని వారు కూడా ఈజబ్బుని ఇతరులతో సమానంగా ఎదుర్కొంటారు,.,
మనం ఇన్సులిన్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గినపుడు దానికి తగ్గట్లు మనం మన మెటబాలిజమ్ ను మార్పులు చేయాల,,, దురదృష్టవశాత్తు మన వైద్యవిధానంలో షుగర్ తిను టాబ్లెట్ లు వేసుకో,లేదా ఇన్సులిన్ వేసుకో మరలా తిను, డోసు పెంచు అనే విధానమే పాపులర్ గా ఉంది… అలా తినడం వలన బరువు పెరుగుతూ మెల్లగా ఊబకియం వైపుగా శరీరం వెళ్ళిపోతుంది..
మెటబాలిజమ్ వెనుకకు తిప్పే విధానం లేదు…
కాని మనం మన ఇన్సులిన్ ఉత్పత్తి కి తగినంత కార్బోహైడ్రేట్ లు తింటే షుగర్ అందుబాటులో ఇస్తే శరీరం మానేజు చేసుకోకలదు.. మనం కార్బులను తగ్గించి, ప్రోటీన్ మరియు కొవ్వు పదార్ధాల మెటబాలిజం యాక్టివేట్ చేస్తే శరీరం వేరే మెటబాలిజం ద్వారా శక్తిని గ్రహించి ఇన్సులిన్ పైన ఆధారపడదు.. చక్కెర లెవల్ ఆటోమాటిక్ గా కంట్రోలు లో కొస్తాయి.. మన బాడీ ఇన్సులిన్ లో C పెప్టైడ్ అందుబాటులో ఉంటాది..అది మైక్రోవెజల్ డిసీసెస్ రాకుండా చేస్తాది.. బయట నుంచి ఇచ్చే ఇన్సులిన్ లో అది ఉండదు…
డయాబెటిస్ అనేది మీ శరీరం యొక్క మార్పు చెందిన జీవక్రియ యొక్క ఒక స్ధితి,,దీనిని మందులతోనో ఇన్సులిన్ తోనే బాగుచేయాల అనుకుంటే మీరు పప్పులో కాలేసి ఊబకాయంలోకి పోతారు.. మీరు మందులు కాదు వాడాల్సింది… ముందు బద్ధకం వదలి నడవండి, వ్యాయామం, ఈత, సైక్లింగు చేయండి-.. నోటి యావ తగ్గించి తినే ఆహారంలో మార్పులు చేయండి.. కార్బులు అతి తక్కువగా తినడం అలవాటు చేసుకొని ప్రోటీన్ లు, ఫాట్సు, సలాడ్ లు తినండి,. బరువు తగ్గడం మొదలవగానే మీ డయాబెటిస్ చక్రభ్రమణం వెనుకకు తిరుగుతుంది.. బరువు తగ్గే కొద్ది మీ శరీరం ద్విగుణీకృత ఉత్సాహంతో కుర్ర వయసు లోకి పోతుంది..
ఏది అనుభవించాలన్నా, ఏది సాధించాలన్నా ఆరోగ్యవంతమైన శరీరం ముఖ్యం.. అది మీ జీవనవిధానం మార్పుతోనే సాధ్యం.. మందులతో కాదు.. మీరు మార్పును ఆహ్వానించి జీవనం సుఖమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.