Devotional

గోనె మూట.. హనుమాన్ దేవాలయాన్ని.. చూచి వద్దాం రండి..

గోనె మూట.. హనుమాన్ దేవాలయాన్ని.. చూచి వద్దాం రండి..

గోనె మూట  హనుమాన్ …!!

🌸తిరుచ్చి మహానగర రైల్వే స్టేషన్ కి వెనుక కల్లుక్కుళి ఆంజనేయస్వామి ఆలయం వున్నది.
ఆంజనేయసస్వామి  ఇక్కడ కొలువైన కధ రసవత్తరమైనది.

🌸ఆంగ్లేయులు భారతదేశాన్ని ఏలినకాలంలో తమ ఆదాయంకోసం ప్రజలనుండి వివిధరకాల పన్నులు వసూలుచేసి పీడిస్తూండేవారు.
అలాటికాలంలో ఉత్తర భారతదేశం నుండి ఒక వైష్ణవ భక్తదాసుడు దక్షిణాదికి వచ్చాడు. అక్కడి బ్రిటిష్ అధికారులు ఆ భక్తుడి వద్దనున్న గోనె మూటని బరువు తూచి భరించలేనంత పన్ను విధించారు.

🌸ఆ వైష్ణవ భక్తుని వద్ద  అంత డబ్బు లేదు. తను అంత డబ్బు చెల్లించుకోలేనని , ఆ  మూటలో
ధాన్యం వున్నాయని చెప్పి ఆ మూటని  అక్కడి రైల్వేస్టేషన్ లోనే వదలి వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులు అయినా ఆ వైష్ణవ భక్తుడు తిరిగి రానేలేదు. ఆ మూట తీసుకోనూలేదు.

🌸ఒకనాడు అధికారులు ఆ మూట విప్పి చూశారు. మూట లోపల ధాన్యానికి బదులు  అందమైన ఆంజనేయ విగ్రహం కనిపించడం వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదంతా హనుమంతుని కరుణాకటాక్షమని తలంచిన  స్థానిక భక్తులు ఆ హనుమంతునికి
ఆనందంతో ఒక చక్కటి ఆలయం నిర్మించారు.

🌸ఆ హనుమంతుని ఆలయం దినదినాభివృధ్ధి చెంది భక్తులపాలిటి కల్పతరువయింది. ప్రతీ సంవత్సరం హనుమజ్జయంతి నాడు  ఆలయంలోని
హనుమంతునికి  10,008  వడలమాల  తులసిమాల , తమలపాకుల మాల ,జాంగ్రీల మాల అంటూ రకరకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు
జరుపుతారు.

🌸ఈ పూజల దర్శనమే చాలు  ఎంతో
పుణ్యం లభిస్తుంది.
కల్లుక్కుళి ఆంజనేయుడిగా పేరుపొందిన ఈ ఆంజనేయుని ఆలయం తిరుచ్చి రైల్వే స్టేషన్
వెనకవేపు వున్నది.