టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడని జోస్యం చెప్పాడు. ఇప్పటికే 75 శతకాలు చేశాడని, ఇంకో 50 చేయగలడని చెప్పాడు
టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడు ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టెస్టుల్లో శతకాన్ని నమోదు చేశాడు. అహ్మాదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీ దీర్ఘకాల ఫార్మాట్‌లో 28వ శతకాన్ని నమోదు చేశాడు. ఫలితంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 571 పరుగులు చేసింది ఆసీస్‌పై 91 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. విరాట్ కోహ్లీకి ఇది 75వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. సచిన్ తర్వాత అత్యధిక శతకాలను బాదిన రెండో క్రికెటర్‌గా ఉన్నాడు. అయితే 34 ఏళ్ల విరాట్.. సచిన్ 100 సెంచరీల రికార్డును అధిగమిస్తాడని సర్వత్రా భావిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై టీమిండియా మాజీ హర్భజన్ సింగ్ కూడా తన స్పందనను తెలియజేశాడు.