జనార్దన్ రెడ్డి …TSPSC చైర్మన్
….
30 లక్షల మంది TSPSC వెబ్ సైట్ లో వన్ టైమ్ రిజిస్టేషన్ చేసుకున్నారు.
అత్యంత పారదర్శకంగా ఉన్న సంస్థ TSPSC .
కాపీయింగ్, మాస్ కాపీయింగ్ జరగకుండా మల్టిపుల్ జంబ్లింగ్ ప్రశ్నలు, ఆప్షన్స్ చేశాం..
# పేపర్ లీకేజ్ అనేది దురదృష్టకరమైన ఘటన.
# 26 నోటిఫికేషన్లు ఇచ్చాం .
# 17 వేలకు పైగా పోస్టులు కవర్ అయ్యాయి .
# ప్రతిసారి 3500 నుంచి 4 వేల మంది TSPSC ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది .
# రాజశేఖర్ రెడ్డి అనే నెట్ వర్క్ ఎక్స్ పర్ట్ TSPSC లో అనుభవం ఉంది .
# 26 నోటిఫికేషన్లలో 7 పరీక్షలు పూర్తి అయ్యాయి.
# TSPSC లో నా పిల్లలు పరీక్షలు రాయలేదు .
# హ్హ్యాకింగ్ పాల్పడినట్లు అనుమానిస్తున్నాము
# ప్రవీణ్ తో కలసి దుర్వినియోగం చేసినట్లు భావిస్తున్నాము.
# అన్ని IP అడ్రెస్ లు ఆయనకు తెలుసు.
# AE EXAM రద్దు కు సంబంధించి రేపు నిర్ణయం తీసుకుంటాం.
# 103 మార్కులు హైఎస్ట్ అనేది నిజం కాదు.
# ప్రవీణ్ పరీక్ష రాసింది నిజమే… 103 మార్కులు వచ్చింది నిజమే, క్వాలిఫై కాలేదు.
# పరీక్ష నిబంధనల మేరకు ఎవరైనా రాయొచ్చు.. అందులో ఇబ్బంది లేదు .
# మొత్తం 9 మంది అరెస్ట్.
# అందులో TSPSC ఉద్యోగులు 5 గురు.వారి ఉద్యోగ0 పోతుంది.
# ప్రవీణ్ ను నిన్ననే సస్పెండ్ చేశాం.
# ఫోరెన్సిక్ ఆడిట్ ( FSL) రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నా0.
# జూన్ 5 నుంచి గ్రూప్ వన్ పరీక్షలు టైమ్ ప్రకారం జరుగుతాయి.
# అన్ని పరీక్షల
పేపర్లు కొత్తగా తయ్యారు చేస్తాం.
పేపర్ లీకేజీపై 48 గంటల్లో నివేదికివ్వండి: తమిళిసై
తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె.. సమగ్ర దర్యాప్తు జరిపి 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాల్సిందిగా కోరారు.