హెచ్-1బి వీసాల గడువు పెంపునకు సిఫార్సు
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్న హెచ్-1బి వీసాదారులకు శుభవార్త..! వీరి వీసా గడు వును (గ్రేస్ పీరియడ్) ప్రస్తుత 60 రోజుల నుంచి 180 రోజులకు పొడిగించాల్సిందిగా బైడెన్ అధ్యక్ష సలహా ఉపసంఘం సిఫార్సు చేసింది. ఇది అమల్లోకి వస్తే భారతీయులు. సహా అమెరికాలో పనిచేస్తున్న వేలాది విదేశీ ఉద్యోగులకు భారీ ఊరటే ఇటీవల గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి సంస్థలు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు తొలగించిన నేపథ్యంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత గడువైన 60 రోజుల్లో ఉద్యోగం సంపాదిం చడం కష్టతరంగా మారింది. దరఖాస్తులు నింపే ప్రక్రియా సంక్లిష్టంగా ఉండటంతో వ్యవధి సరిపోవడం లేదు. ఈ సిఫార్సు అమల్లోకి వస్తే 180 రోజుల్లోపు కొత్త కొలువు వెతుక్కొనే వెసులుబాటు కలుగు తుంది. “ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బి ఉద్యోగుల గ్రేస్ పీరియడ్ను 60 నుంచి 180 రోజులకు పొడిగించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్