*అమరావతి : అసెంబ్లీ బయట ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన – తన నియోజకవర్గంలోని సమస్యలపై ప్రకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీకి పాదయాత్ర – నా అంతరాత్మ ప్రభోదానుసారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తా – వైసీపీ ఇతర ఎమ్మెల్యేలు కూడా అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నా – ప్రజా సమస్యల పరిష్కారానికి నా నిరసన కొనసాగుతోంది – సమస్యల పరిష్కారం కోసం నాలుగేళ్లు పోరాటం చేసి గళం వినిపిస్తున్నా – మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీ జరిగినన్ని రోజులు ప్లకార్డ్ ప్రదర్శిస్తూ నిలబడే ఉంటా : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* అమరావతి : అసెంబ్లీ బయట ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన – తన నియోజకవర్గంలోని సమస్యలపై ప్రకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీకి పాదయాత్ర – నా అంతరాత్మ ప్రభోదానుసారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తా – వైసీపీ ఇతర ఎమ్మెల్యేలు కూడా అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నా – ప్రజా సమస్యల పరిష్కారానికి నా నిరసన కొనసాగుతోంది – సమస్యల పరిష్కారం కోసం నాలుగేళ్లు పోరాటం చేసి గళం వినిపిస్తున్నా – మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీ జరిగినన్ని రోజులు ప్లకార్డ్ ప్రదర్శిస్తూ నిలబడే ఉంటా : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
*ఆనం రాం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలే. ఆనం అయితే నిన్న అంటే అసెంబ్లీ ప్రారంభం రోజున ఏకంగా టీడీపీ వాళ్లతో పాటు కూర్చుండిపోయారు. అయితే ఇవాళ సడెన్గా అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేలు ఆనం రాం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఎదురు పడ్డారు. వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అసెంబ్లీ లాబీల్లో కలుసుకున్న వీరిద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రస్తావన వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని ఆనంకు చెప్పానని కోటంరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో అదే ఆచరిస్తారా? అని ప్రశ్నించారట. దీనికి తాను ఎప్పుడూ ఆత్మ ప్రబోధానుసారమే ఓటేస్తానంటూ ఆనం వ్యాఖ్యానించారు.
*అసెంబ్లీలో వాడీవేడిగా ప్రశ్నోత్తరాలు
సభలో అందుబాటులో లేని పలువురు మంత్రులు
అసెంబ్లీ అంటే లెక్కలేదా అంటూ టీడీపీ ఆగ్రహం
ఏపీ శాసనసభ లో ప్రశ్నోత్తరాలు బుధవారం వాడీవేడిగా సాగాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏపీ శాసనసభలో పలువురు మంత్రులు అందుబాటులో లేకుండా పోయారు. దీనిపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా మంత్రులు చెల్లుబోయిన, పెద్దిరెడ్డిలను స్పీకర్ తమ్మినేని సీతారాం పిలిచారు. అయితే మంత్రులు అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ తర్వాత ప్రశ్నలకు వెళ్లారు. ప్రశ్నోత్తరాల్లో మంత్రులు అందుబాటులో లేకపోవడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అసెంబ్లీ అంటే మంత్రులకు లెక్కలేదా అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుంటే ఎలా అంటూ టీడీపీ సభ్యులు విమర్శలు గుప్పించారు. దీంతో మంత్రులతో ఈ సెన్సులో సమాధానం చెప్పిస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పడంతో తెలుగుదేశం సభ్యులు వెనక్కి తగ్గారు. అనంతరం ప్రశ్నోత్తారాలు కొనసాగాయి. విద్యాశాఖ అధికారులకు మంత్రికి మధ్య సమన్వయ లోపం ఉన్నట్టు ఉందని టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయస్వామి అన్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవంబర్ 10 సమీక్షలో మూడు లక్షల 95 వేల మంది తగ్గారని చెప్పారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్టీ, ఎస్సీ కాలనీలలో పాఠశాలలు పెడితే దాన్ని ఈ ప్రభుత్వం తీసేశారని మండిపడ్డారు. మంత్రి అప్పలరాజు నియోజకవర్గంలోనే అనేక పాఠశాలలను మూసేశారన్నారు. ప్రపంచ బ్యాంకు నిభందనలకు సంబంధించి పాఠశాలలను మెర్జి చేస్తున్నారని తెలిపారు.
దీనిపై మంత్రి బొత్స సత్య నారాయణ సమాధానం ఇస్తూ ప్రైవేటు పాఠశాలల్లో సంఖ్య పెరిగింది అన్నారు. అయితే ఏపీలో 102 శాతం అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. ఈరోజు 70 లక్షల 18 వేలమంది చదువుతున్నారని తెలిపారు. గవర్నమెంట్లో 39 లక్షల 69 వేల మంది చదువుతున్నారన్నారు. అంటే గవర్నమెంట్లో పెరిగారా, ప్రైవేట్లో పెరిగారో తమరు చూసుకోండన్నారు. గత ప్రభుత్వ హయంలో 5వేల స్కూళ్ళు మూసివేశారని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక 3 వేల స్కూళ్లను తెరిపించామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క స్కూలు మూసి వెయ్యలేదని తెలియజేశారు. గతంలో 1 నుంచి 5 వరకూ ఒకే టీచర్ టీచ్ చేసేవారని, ఇప్పుడు మూడవ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట తీసుకువచ్చామన్నారు. కిలో మీటరు పరిధిలో ఉన్న స్కూళ్లు విలీనం చేయాలని నిర్ణయిచామని అన్నారు. అయితే ఏ ఒక్క స్కూలును ఇప్పటి వరకూ మూయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
*సన్నాయి నొక్కులు వద్దు బాబూ
సభలో అచ్చెన్న ప్రశ్నకు మంత్రి అంబటి రాంబాబు
*ఏపీ అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాలు గరంగరంగా సాగాయి. సాగునీటి రంగంపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటలయుద్ధం చోటు చేసుకుంది. సాగునీటి రంగంపై ప్రశ్నకు సంబంధించి అచ్చెన్న మాట్లాడుతూ తాను తప్పు ఫిగర్లు చెపితే మంత్రి దానికి సామాధానం ఇవ్వాలని అన్నారు. సాగునీటిపై అన్ని ప్రభుత్వాలు దృష్టిపెడతాయని, అయితే ఈ నాలుగేళ్ళు ఈ రంగం పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యిందని తెలిపారు. చంద్రబాబు సీఎంగా సాగునీటికి రూ.68293 కోట్లు ఖర్చు చేశారని గుర్తుచేశారు. 68 ప్రాజెక్టులు డిజైన్ చేశారని.. 23 ప్రాజెక్టులు పూర్తిచేశారని తెలిపారు. 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు 7 లక్షల ఎకరాలకు స్ధిరీకరణ చేశారన్నారు. ఉత్తరాంధ్రలో ఇఎన్సి నారాయణ రెడ్డి 2014-18 మధ్య 69 వేల ఎకరాలు సాగునీరు అందించారని చెప్పారు. ఈ నాలుగేళ్ళలో రూ.488 కోట్లు ఖర్చు చేసి 11 వేల ఎకరాలకు నీరు అందించారన్నారు. మంత్రి చాలా తెలివిగా శాతాల్లో చెపుతున్నారని వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్న మాట్లాడుతున్న సమయంలో మంత్రి అంబటి రాంబాబు అడ్డుతగిలారు. ‘‘నేను మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఉత్తరాంధ్రలో ప్రోగ్రస్లో ఉన్న ప్రాజెక్టు ఏంటి, ఎప్పటికి సమాధానం ఇస్తారు అని అడగాలి’’ అని అన్నారు. వంశధార స్టేజ్ 2 ఫేజ్ 1ను తొందరగా పూర్తిచేయాలని, ఫేజ్ 2లో రూ.870 కోట్లు గతంలో ఖర్చు చేశామని చెప్పారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై మట్లాడే హక్కు రాజశేఖర రెడ్డి వారసులకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తిచేసి ఉత్తరాంధ్రలోని ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
*అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..
పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేసిన స్పీకర్.
*పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కామెంట్స్..
ఏపి అసెంబ్లీ లో కొత్త కొత్త సంప్రదాయాలు తీసుకువస్తున్నారు..
రివర్స్ టెండ్రింగ్ ముఖ్యమంత్రి రివర్స్ పాలన చేస్తున్నారు.
ఈరోజు ఉదయం నుండి ఒక్క సారి కూడా మాట్లాడకపోయినా నన్ను సస్పెండ్ చేశారు..
నేను అడిగిన రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినా ప్రభుత్వం..
రాబోయే పది రోజులు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సస్పెండ్ చేశారు..
4 విడతల వైఎస్ఆర్ అసర కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న వైనాన్ని ఎండగడతమని కక్షతో సస్పెండ్ చేశారు.
అసెంబ్లీలో నేడు స్పీకర్ తన బాధ్యత తను సక్రమంగా నిర్వర్తించే శక్తి ఆయనకు లేదు..
సీఎం కనుసన్నల్లోనే స్పీకర్ నడుస్తున్నారు..