Business

లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు

లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు

మంగళవారం స్టాక్ మార్కెట్(Stock market) సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. టాప్ 30 సూచీల్లో దాదాపు అన్ని షేర్లు లాభాల్లో, కొనసాగుతున్నాయి.

దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 414 పాయింట్ల లాభంతో 58,314 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 129.30 పాయింట్ల లాభంతో 17,172 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.14 వద్ద కొనసాగుతోంది.

ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, టాటా మోటార్స్, విప్రో, ఐటీసీ, ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా,

నెస్లే షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐఎన్, సన్ ఫార్మా నష్టాల్లో ట్రేడింగ్ను మొదలు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన మార్కెట్లు లాభాలకు కారణమయ్యాయి. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు ఆశించిన స్థాయిలో రావడంతో ఫెడ్ స్వల్పంగా రేట్లు పెంచొచ్చన్న అంచనాలు సెంటిమెంట్కు

కారణమయ్యాయి. బ్రెంట్ క్రూడాయిల్ అంతర్జాతీయంగా 78.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.