ScienceAndTech

చున్నీలు, చేతులపై ఆన్సర్లు.. ఎస్కేయూ డిగ్రీ పరీక్షల్లో విద్యార్థుల కాపీయింగ్.. డిబార్!

చున్నీలు, చేతులపై ఆన్సర్లు.. ఎస్కేయూ డిగ్రీ పరీక్షల్లో విద్యార్థుల కాపీయింగ్.. డిబార్!

ఎస్‌కేయూ పరిధిలో డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు

కాపీ కొడుతూ దొరికిన రెండు కళాశాలల విద్యార్థులు

అనంతపురంలో ఐదుగురు, తాడిపత్రిలో ఒకరి డిబార్

అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ(ఎస్‌కేయూ) పరిధిలోని డిగ్రీ విద్యార్థులు కాపీయింగ్‌లో కొత్త దారులు వెతుక్కున్నారు. అబ్బాయిలు శరీరంపై ఆన్సర్లు రాసుకొస్తే, అమ్మాయిలు చున్నీలపై రాసుకొచ్చారు. చేసిన తప్పుకు వీరందరూ డిబారయ్యారు. ఎస్‌కేయూ పరిధిలోని డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో పలువురు కాపీ కొడుతూ ఇన్విజిలేటర్లకు చిక్కారు. ఎస్వీ డిగ్రీ కళాశాల, ఎస్ఎల్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు చేతులపై సమాధానాలు రాసుకుని షర్టు చేతులతో వాటిని కప్పేస్తే, అమ్మాయిలు ఏకంగా చున్నీలపైనే సమాధానాలు రాసుకొచ్చారు.

పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్లో కొందరు అనుమానాస్పదంగా కనిపించడంతో ఇన్విజిలేటర్లు తనిఖీ చేయడంతో వారి కాపీయింగ్ బాగోతం వెలుగు చూసింది. కాపీకొట్టిన విద్యార్థులందరినీ అధికారులు డిబార్ చేశారు.