Fashion

నా భార్య ఎప్పుడూ పడుకునే ఉంటోంది సార్..

నా భార్య ఎప్పుడూ పడుకునే ఉంటోంది సార్..

బెంగళూరులోని బసవగుడిలో నివసిస్తున్న ఓ భర్త తన భార్యపై వింత ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఇమ్రాన్ ఖాన్.. తన భార్య అయేషా మొద్దునిద్ర పోతోందంటూ ఫిర్యాదు చేశాడు. ఆమె రాత్రి భోజనం చేసి నిద్రపోతే మరుసటి రోజు మ.12.30 వరకు లేవడంలేదనీ.. తిరిగి సా.5.30 గం.కు మళ్లీ పడుకుని రాత్రి 9.30 గం.కు మేలుకుంటుందని వాపోయాడు. ఇలా ఐదేళ్ల నుంచి తనకు నరకం చూపిస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు.