🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 *18.03.2023 ✍🏻*
🗓 *నేటి రాశి ఫలాలు 🗓*
🐐 మేషం
ఈరోజు (18-03-2023)
ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. శని దేవుని అనుగ్రహంతో మీకు కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. మీరు శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో సానుకూల ఫలితాలొస్తాయి. అయితే అనవసరమైన ఖర్చులపై నియంత్రణ ఉంచాలి. ఈ కారణంగా మీ బడ్జెట్ బ్యాలెన్స్‌గా ఉంటుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని విషయాల్లో మద్దతు పొందుతారు. మీరు తల్లిదండ్రుల ఆశీస్సులు పొందుతారు.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (18-03-2023)
ఈ రాశి వారు ఈరోజు ఒక సామాజిక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. మీరు చేసే పనులకు గౌరవం పెరుగుతుంది. మీకు సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు కొత్త ఆలోచనలను అనుసరిస్తారు. మీ ఆర్థిక పరిస్థితులు బలోపేతం అవుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంది.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (18-03-2023)
ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ తోబుట్టువులతో వివాదాలను కలిగి ఉండొచ్చు. ఈ సమయంలో మీరు సంయమనం పాటించాలి. మరోవైపు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఏదైనా ఆస్తి తగాదాలుంటే, అది ఈరోజుతో ముగుస్తుంది. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (18-03-2023)
ఈ రాశి వారికి ఈరోజు మంచి విజయం చేకూరనుంది. ఈరోజు ఒక పెద్ద వ్యక్తి సహాయంతో కొన్ని పనులను పూర్తి చేయొచ్చు. వ్యాపారులు ఈరోజు కొత్త ప్రణాళికలు చేసే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు మంచి విజయాలను సాధించొచ్చు. ఈ కారణంగా మీ మనసు సంతోషంగా ఉంటుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (18-03-2023)
ఈ రాశి వారు ఈరోజు చేసే ప్రతి పనిలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పనుల గురించి ఎవ్వరికీ చెప్పకండి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధం బలంగా ఉంటుంది.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (18-03-2023)
ఈ రాశి వారు ఈరోజు కళ, రచన రంగాల్లో మంచి ప్రదర్శనలు ఇవ్వొచ్చు. మీ మనసు నుంచి అన్ని రకాల నిరాశలు ముగుస్తాయి. ఈరోజు మీరు చేసే పనుల్లో అనేక అడ్డంకుల నుంచి విముక్తి పొందుతారు. మీ కుటుంబ వ్యవహారాల్లో తండ్రి సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. మీరు పిల్లల భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందుతారు.
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (18-03-2023)
ఈ రాశి వారు ఈరోజు చాలా ముఖ్యమైన పనుల్లో పాల్గొంటారు. ఈరోజు మీ రంగానికి చెందిన పనుల్లో మంచి విజయాలను సాధిస్తారు. మీరు కష్టానికి తగిన ఫలితాల్ని పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. భవిష్యత్తు గురించి ఆందోళనలన్నీ తీరిపోతాయి. పెట్టుబడి పెట్టేందుకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (18-03-2023)
ఈ రాశి వారు ఈరోజు తమ ప్రవర్తన గురించి చాలా ఆందోళన చెందుతారు. దీంతో పాటు మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు కష్టాలకు తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం మతపరమైన, సామాజిక కార్యక్రమాల్లో గడుపుతారు. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (18-03-2023)
ఈ రాశి వారు ఈరోజు తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరోవైపు ఈరోజు స్నేహితులతో మంచిగా గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. పిల్లలకు సంబంధించిన ఏదైనా నిర్ణయం ఈరోజు మిమ్మల్ని కొంచెం ఆందోళనకు గురి చేస్తుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (18-03-2023)
ఈ రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు. ఏదైనా పెద్ద లావాదేవీల కోసం ప్రణాళికలు రచించి, అందులో విజయం సాధిస్తారు. మీ పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ఈ కారణంగా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి నుంచి చాలా ప్రేమను పొందుతారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (18-03-2023)
ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో సీనియర్ల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. మరోవైపు మీ ప్రత్యర్థులు మీ పనులను అడ్డుకోవచ్చు. ఇలాంటి సమయంలో మీరు తెలివితేటలతో శత్రువులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (18-03-2023)
ఈ రాశి వారిలో అవివాహితులకు ఈరోజు మంచి వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. ఈ సమయంలో మీ పనులన్నీ పూర్తయినట్టు అనిపిస్తుంది. వ్యాపారులకు ఈరోజు మంచి లాభదాయకంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితులన్నీ బలోపేతం అవుతాయి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామికి బహుమతి కొనుగోలు చేయొచ్చు. ఈరోజు మీకు, మీ పిల్లలకు మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది. ఈ కారణంగా మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది.
🦈🦈🦈🦈🦈🦈🦈