ఐపీఎల్ 16వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. టైటిల్ కోసం 10 జట్లు ముఖాముఖిగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. IPL 2023లో ఎవరు కింగ్ అవుతారో మే 28న జరిగే ఫైనల్ తర్వాత తేలనుంది.
ఐపీఎల్ 16వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. టైటిల్ కోసం 10 జట్లు ముఖాముఖిగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. IPL 2023లో ఎవరు కింగ్ అవుతారో మే 28న జరిగే ఫైనల్ తర్వాత తేలనుంది. అయితే ఈ లీగ్‌లో పేరుగాంచిన 4గురు ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో సత్తా చాటి అగ్రస్థానంలో నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ కోహ్లి సారథ్యంలోని జట్టు టైటిల్ గెలవకపోవచ్చు. కానీ, ఈ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కోహ్లి 223 మ్యాచ్‌ల్లో 215 ఇన్నింగ్స్‌లలో 129.15 స్ట్రైక్ రేట్‌తో 6624 పరుగులు చేశాడు.
గత 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. అతను 6 సెంచరీలు కొట్టాడు. 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఐపీఎల్ చరిత్రలో ఒక బ్యాట్స్‌మెన్ చేసిన అతిపెద్ద స్కోర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.
ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. అతను 162 మ్యాచ్‌లలో 140.69 సగటుతో మొత్తం 5881 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలతో సహా గరిష్టంగా 54 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డ్ క్రిస్ గేల్ బ్యాట్ నుంచి వచ్చింది. ఐపీఎల్ చరిత్రలో 142 మ్యాచ్‌లు ఆడి 141 ఇన్నింగ్స్‌ల్లో 357 సిక్సర్లు బాదాడు.
ఐపీఎల్‌లో ఫోర్ల వర్షం కురిపించడంలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ముందున్నాడు. 206 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 701 ఫోర్లు కొట్టాడు. అతని ఈ రికార్డు దరిదాపుల్లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా లేకపోవడం గమనార్హం.