స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు, వాలంటీరు (ఎస్పై పక్కన ఉన్న వ్యక్తి), మరో వ్యక్తితో పోలీసులు.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నివగాం గ్రామానికి చెందిన బూరాడ సుందరనారాయణ(బుజ్జి) అనే గ్రామ వాలంటీరును శనివారం అక్రమంగా మద్యం తర లిస్తుండగా అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఎం. గోవింద్ తెలిపారు. అతన్నుంచి 10 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని, కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. మండలంలోని సిరుసువాడకు చెందిన మల్లా ఫాల్గుణ ఆక్రమంగా మద్యం రవాణా చేస్తుండగా అరెస్టు చేసినట్లు చెప్పారు.