Kids

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై సిట్‌ విచారణ కొనసాగుతుంది. 9 మంది నిందితులను సిట్‌ అధికారులు మూడోరోజు విచారిస్తున్నారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌, రేణుక ఇచ్చిన సమాచారం ఆధారంగా… మరి కొందరిని విచారణకు పిలిచినట్లు సమాచారం. అనుమానితుల విచారణను గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. గ్రూప్‌-1 పరీక్ష రాసి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నవారిని ఫోన్‌లో విచారించింది సిట్. ప్రవీణ్, రాజశేఖర్‌, రేణుక కస్టడీలో ఉన్నప్పుడే… మరికొందరిని విచారించాలని సిట్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై హైకోర్టులో NSUI పిటిషన్‌ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు న్యాయవాది వివేక్‌ధన్కా వాదనలు విన్పిస్తారని.. NSUI తరపు న్యాయవాది కరుణాకర్‌ కోర్టుకు తెలిపారు. రేపటికి వాయిదా వేయాలని NSUI తరపు న్యాయవాది కోరారు. దీంతో NSUI పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.