సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒక్కరిగా పేరు తెచ్చుకున్న సమంత మరియు నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంఘటన అందరిని ఎలా షాక్ కి గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారనే విషయం ని ఇప్పటికి ఎవ్వరు జీర్ణించుకోలేకపోతున్నారు..కానీ వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నాం అనే విషయాన్నీ పూర్తిగా మర్చిపొయ్యి ఎవరి జీవితం లో వారు ఫుల్ బిజీ గా గడుపుతున్నారు..ఇది ఇలా ఉండగా గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో నాగ చైతన్య శోభిత దూళిపాళ్ల అనే ప్రముఖ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని..త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్త నేషనల్ లెవెల్ లో సెన్సషనల్ టాపిక్ గా మారింది..అయితే ఇది నాగ చైతన్య మీద అక్కసుతో సమంత తన PR టీం తో నాగ చైతన్య పై అసత్య ప్రచారాలు చేయిస్తుందని అక్కినేని అభిమానులు సమంత పై ఆరోపణలు చేసారు..దీనిపై సమంత కూడా ట్విట్టర్ లో చాలా ఘాటుగానే స్పందించింది.
‘ఒక్క అబ్బాయి మీద రూమర్స్ వస్తే అది అమ్మాయి కావాలని చేయించింది అంటారు..అదే ఒక్క అమ్మాయి మీద రూమర్స్ వస్తే అవి నమ్మేసి ఆ అమ్మాయి మీద లేనిపోని ఆరోపణలు చేస్తారు..అసలు ఈ సమాజం ఎటు పోతుంది..విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి జీవితం ని వాళ్ళు చూసుకుంటున్నాము..మీరు కూడా మీ జీవితం ని చూసుకొని..మీ కెరీర్ మీద ద్రుష్టి పెట్టండి..మీ కుటుంబ సభ్యుల మీద ప్రేమ చూపించండి..మా జీవితాల గురించి మీకు అనవసరం’ అంటూ సమంత ఒక్క ట్వీట్ పెట్టింది..ఇది ఇలా ఉండగా నాగ చైతన్య రెండవ పెళ్లి గురించి ఆయన తండ్రి అక్కినేని నాగార్జున ఇటీవల తన సన్నిహితుల సమక్షం లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..త్వరలోనే అఖిల్ మరియు నాగ చైతన్యలకు పెళ్లిళ్లు చేయబోతున్నాను అని..దానికి సంబంధించిన ఏర్పాట్లు గురించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది..దీనితో సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి నాగ చైతన్య – శోభిత దూళిపాళ్ల డేటింగ్ విషయం నిజమే అని దాదాపుగా ఖారారు అయ్యిందనే చెప్పొచ్చు.
శోభిత దూళిపాళ్ల ఇప్పటి వరుకు టాలీవుడ్ లో కేవలం గూఢచారి మరియు మేజర్ వంటి సినిమాలు మాత్రమే చేసింది..నాగ చైతన్య తో కలిసి ఆమె ఇప్పటి వరుకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు..కానీ వీళ్లిద్దరి మధ్య పరిచయాలు ఎలా ఏర్పడింది అనే విషయం ఎవ్వరికి తెలీదు కానీ, శోభిత దూళిపాళ్ల టాలీవుడ్ లో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి ఫాలో అవుతున్నది కేవలం ఇద్దరినీ..వారిలో ఒక్కరు నాగ చైతన్య కాగా మరొక్కరు అడవి శేష్..అడవి శేష్ అంటే అతనితో కలిసి సినిమాలు చేసింది కాబట్టి స్నేహం ఉండడం వల్ల ఫాలో అవుతుంది అనుకోవచ్చు..కానీ నాగ చైతన్య తో ఒక్క సినిమా కూడా చెయ్యకుండా అతనిని ఫాలో అవుతుంది అంటే కచ్చితంగా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలు నిజమేనని అభిమానులు కూడా నిర్ధారణకు వచ్చేసారు..మరో విషయం ఏమిటి అంటే నాగ చైతన్య మరియు శోభిత మధ్య సమంత తో నాగ చైతన్య వైవాహిక సంబంధం లో ఉన్నప్పటి నుండే రేలషన్ ఉందని..ఈ విషయం తెలిసిన తర్వాతే నాగ చైతన్య తో గొడవలు పెట్టుకొని సమంత విడాకులు తీసుకుందని తెలుస్తుంది..ఇందులో నిజం ఎంత మాత్రం ఉందొ ఎవరికీ తెలియదు.