ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్నాడు తితిదే చైర్మన్, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి పోలింగ్ స్టేషన్ వద్దకు వెళ్లిన సంఘటనకు సంబంధించి విశాఖ మహారాణిపేట తహసీల్దార్ ఆనంద్ కుమార్, సీఐ రమణమూర్తిలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని తెలిసింది. పోలింగ్ సమయంలో వేరే జిల్లాకు చెందిన
సుబ్బారెడ్డిని విశాఖలో ఉండనిచ్చారని.. పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్కు ఒక నిబంధన సుబ్బారెడ్డికి మరొక నిబంధన ఎలా వర్తింపజేస్తారని ఎన్నికల సంఘా నికి తెదేపా ఫిర్యాదు చేసింది. బాధ్యులపై చర్యలు తీసు కోవాలని ఈసీకి తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు. చేశారు. ఈసీ ఆదేశాల మేరకు ఇద్దరికి జిల్లా ఉన్నతాధికా రులు షోకాజ్ నోటీసులిచ్చినట్లు సమాచారం..