NRI-NRT

దుబాయిలో వైభవంగా ఉగాది వేడుకలు..

దుబాయిలో వైభవంగా ఉగాది వేడుకలు..

తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగల నిర్వహణలో దుబాయిలో ముందుంజలో ఉండె దుబాయి తెలుగు అసోసియెషన్ ప్రతి సంవత్సరం తరహా ఈ సారి కూడ ఉగాది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. మాతృత్వం మరియు జీవితంలో భాగమైన సెల్ ఫోన్ వాడకంతో పాటు తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలపై వినోద్ ఆలపించిన ఘజల్స్ కార్యక్రంలో ప్రత్యెక ఆకర్షణగా నిలిచాయి.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు సినీ రంగం నుండి సంగీత దర్శకురాలు యం.యం. శ్రీలేఖ, కథా నాయిక కామా జెఠ్మాలనీ, నిర్మాత రాజశేఖర వర్మలతో పాటు న్యాయవాది మాధవరావు పట్నాయక్ హజరయ్యారు.

సినీ సంగీత ప్రస్ధానంలో పాతిక వసంతాలు పూర్తి చేసుకోంటున్న నేపథ్యంలో శ్రీ లేఖ తాను 25 దేశాలలో పర్యటిస్తున్నట్లుగా అందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ లో పర్యటిస్తున్నాని చెప్పారు.
శ్రీలేఖ ఇతర వర్తమాన గాయనీగాయకులు మౌనిక యాదవ్, రవి, గజల్ వినోద్ లతో కలిసి ఆలపించిన బహుళ ప్రజాదరణ పొందిన సినీ మధుర గీతాలు ఆడిటోరియంలోని ప్రేక్షకులందరనీ వుర్రూతలూగించాయి

మిమిక్రీ కళాకారుడు రాజు ప్రదర్శించిన సినీ మరియు రాజకీయ ప్రముఖుల అనుకరణ అందరినీ నవ్వుల్లో ఓలలాడించింది. మిమిక్రీ రాజు 8 నిమిషాల నిడివి వున్న సినీ సన్నివేశాల మాలికని ప్రదర్శిస్తూ, అందులో కనిపించిన దాదపు 50 మంది ప్రముఖ సినీ నటులను అనుకరించటం ఆహూతులందరినీ మంత్రముగ్ధులను చేసింది. మిమిక్రీ రాజు మొట్టమొదటి సారిగా యిటువంటి ప్రయత్నం చేయటం, సఫలీకృతం అవటం ఎంతో తృప్తినిచ్చినట్లు తెలిపారు
తెలుగు అసోసియెషన్ కల్చరల్ డైరెక్టర్ వక్కలగడ్డ వెంకట సురేష్ అన్ని తానై కార్యక్రమాన్ని నిర్వహించగా యాంకర్ రవి, ఉష, శరణ్య సంధానకర్తలు గా వ్యవహరించారు.

తెలుగు అస్సోసిఏషన్ తరపున జనరల్ సెక్రటరీ వివేకానంద్ బలుస సేవ, సంస్కృతి, సమైక్యత అనే మూడు మూల స్థంభాలపై స్థాపించిన తెలుగు అసోసియెషన్ ప్రగతి గూర్చి వివరించారు.

తెలుగు అసోసియేషన్ అద్యక్షుడు దినేష్ కుమార్ ఉగ్గిన , ఉపాద్యక్షుడు మసిఉద్దీన్, ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా , ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డైరెక్టర్ సురేంద్ర ధనేకుల , ఫైనాన్స్ డైరెక్టర్ మురళీ కృష్ణ నూకల, కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీ సాయి ప్రకాష్ సుంకు, కమ్యూనిటీ డైరెక్టర్ రవి వుట్నూరి, మార్కెటింగ్ డైరెక్టర్ అంబేద్కర్, లీగల్ డైరెక్టర్ శ్రీధర్ దామర్ల వివిధ ఏర్పాట్లను పరిశీలించగా తెలుగు అసోసియేషన్ పక్షాన వివిధ వర్కింగ్ కమిటీల సభ్యులు ఫ్లోరెన్స్ విమల, సౌజన్య, విజయభాస్కర్, ఫహీమ్, మోహన కృష్ణ, శరత్ చంద్ర, భీం శంకర్ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను సమన్వయం చేసారు.