Devotional

శ్రీశైలం లో ఉగాది మహోత్సవాలు… మహాసరస్వతి అలంకారంలో అమ్మవారు

శ్రీశైలం లో ఉగాది మహోత్సవాలు… మహాసరస్వతి అలంకారంలో అమ్మవారు

నంద్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి ఆలయం లో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉగాది మహోత్సవాల్లో భాగంగా మూడవరోజు మహాసరస్వతి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు. నందివాహనంపై ఆసీనులై ఆదిదంపతులు ప్రత్యేక పూజలందుకోనున్నారు. శ్రీస్వామి అమ్మవార్లకు క్షేత్ర పురవీధుల్లో ప్రభోత్సవం జరుగనుంది. సాయంత్రం క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటలకు శివదీక్ష శిబిరాలలో వీరశైవులచే వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం చేయనున్నారు. భక్తుల రద్ది కారణంగా స్వామివారి స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నామని… భక్తులందరికీ అలంకార దర్శనం కల్పిస్తున్నామని ఈఓ లవన్న పేర్కొన్నారు.