Politics

విజయవాడ : రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

విజయవాడ : రేపు ఏపీలో ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

– ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎన్నికలపై దిశా నిర్దేశం చేసిన అధికార, ప్రతిపక్ష పార్టీలు

– తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో 3కి 3 స్థానాలు అధికార పార్టీ చేజార్చుకున్న వైనం

– ఈ పరిణామాలతో అధికార పార్టీ నేతల్లో మొదలైన కలవరం

– ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరు పార్టీలకు కీలకం

– ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకం కానున్న అధికార పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, అసంతృప్తి ఎమ్మెల్యేలు

– అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్న మంత్రులు

– కీలక ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒక్కొక్కరికి 22 మంది సభ్యుల అప్పగింత

– అప్పగించిన సభ్యులు ఓటు వేసే బాధ్యత మంత్రులదే అని చెప్పిన సీఎం జగన్

– రెండు రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా నాలుగు సార్లు మాక్ పోల్ నిర్వహణ

– నాలుగు సార్లు కూడా తప్పులే జరిగాయి అని సమాచారం

– మరో సారి ఎలా ఓటు వెయ్యాలి అని ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయనున్న మంత్రులు, పార్టీ కీలక నేతలు

– విజయవాడలో పలు చోట్లా ఎవరికి కేటాయించిన గ్రూప్ సభ్యులతో వారు విడివిడిగా సమావేశాల నిర్వహణ

– ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో రాష్ట్రంలో మరింత హీట్