అక్కినేని వారసుడుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నాగచైతన్య. జోష్ సినిమాతో చైతూ టాలీవుడ్ లో అడుగుపెట్టగా మొదటి సినిమాతోనే మంచి మార్కుల సంపాదించుకున్నాడు. ఆ తరవాత చాలా సినిమాలలో నటించి మెప్పించాడు. ఇక చైతూ సమంతతో కలిసి ఏమ్మాయ చేశావే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా తరవాత సమంత కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతే కాకుండా ఆ తరవాత మనం సినిమాలో వీరిద్దరూ భార్యభర్తలుగా నటించారు. ఇక సినిమాలో మాదిరిగానే బయట కూడా ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తరవాత ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే.
సమంత బాలీవుడ్ మరియు కోలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. మరోవైపు చైతూ కూడా బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా చైతూ గురించి కొన్ని వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. నాగచైతన్య ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి కొత్త ఇంటికి మకాం మారుస్తున్నాడట.
ఇక ఆ ఇంటిని తన అభిరుచికి తగ్గట్టుగా నిర్మించుకున్నాడట. మరోవైపు చైతూ రెండో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాడట. నాగార్జున కూడా చైతూకు సంబంధాలు వెతుకుతుండటంతో అమల మాత్రం అడ్డుపడుతున్నట్టు టాక్. అఖిల్ కు కూడా సంబంధం చూసిన తరవాత ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేయాలని నాగ్ కు సూచించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.