Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ (Pm Modi) ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గుజరాత్ సూరత్ కోర్టు (Gujarat Surat Court) గురువారం కీలక తీర్పు వెలువరించింది.
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ (Pm Modi) ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గుజరాత్ సూరత్ కోర్టు (Gujarat Surat Court) గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. రెండేండ్లు జైలు శిక్ష విధించింది.
మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..? ఆయన ప్రశ్నించారు. దీనిపై గుజరాత్ బీజేపీ నేతలు కోర్టుకు వెళ్లారు. రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో నేడు విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చింది. ఈ మేరకు రాహుల్‌కు రెండేండ్ల జైలు శిక్ష విధించింది