Editorials

ఈ రోజు మత్స్య జయంతి….!!

ఈ రోజు మత్స్య జయంతి….!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌷మత్స్య జయంతి చైత్ర బహుళ తదియ నాడు జరుగుతుంది.🌷

🌿ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు దశావతారములు ఎత్తాడు. వీటిలో మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం.

🌸కొందరు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచికగా చెబుతారు.

🌿బ్రహ్మకు ఒక పగలు అంటే – వెయ్యి మహాయుగాలు గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు.

🌸ఆసమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు.

🌿దీనినే నైమిత్తిక ప్రళయంగా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని ‘కల్పం’అని అంటారు.

🌹మత్స్యావతారం అసలు కథ🌹

🌸వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు , విష్ణు భక్తుడు.

🌿ఒకరోజు అతను కృతమాలా నదికి వెళ్ళి స్నానం చేసి , సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిటలో చేపపిల్ల పడినది.

🌸రాజు దానిని నీటిలోనికి జారవిడిచాడు. మళ్ళీ నీటిని దోసిలి లోకి తీసుకున్నప్పుడు చేతిలోనికి చేప వచ్చి ఈ విధంగా పలికింది “రాజా ! నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి , దయచేసి నన్ను రక్షించు” అని ప్రార్థించినది.

🌿వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేసాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్రపట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు.

🌸ఆ మరుసటిరోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు. అ రాజు … ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యం (చేప) శతయోజన ప్రమాణానికి విస్తరించింది.

🌿అంతట ఆ మత్స్యం “తాను శ్రీమన్నారాయణుడుని అని , ఏడు రోజులలో ప్రళయం రానున్నదని , సర్వజీవరాశులు నశించిపోతాయి అని , ఈ లోకమంతా మహాసాగరమవుతుంది అని

🌸, నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని” పలికింది. ఒకపెద్ద నౌకను నిర్మించి , అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు , బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని , సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది.

🌿మీనరూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి , ప్రళయాంతం వరకు రక్షిస్తాడు.

🌸సాంఖ్యాయోగ క్రియాసహితమైన పురాణసంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి , ‘వైవస్వత మనువు’ గా ప్రశిద్ధికెక్కాడు.

🌿బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి.

🌸బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటినుండి వేదాలు జారి క్రింద పడగా , “సొమకాసురుడు” అనే రాక్షసుడు నాలుగు వేదాలని అపహరించి , సముద్రగర్భంలోకి వెళ్ళిపోయాడు.

🌿బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా , అతను మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి , అతని కడుపుని చీల్చి …… వేదాలను – దక్షిణావృత శంఖాన్ని తీసుకొని , బ్రహ్మవద్దకు వచ్చాడు.

🌸శంఖాన్ని తానూ తీసుకొని , శిధిలమైన వేదభాగాలని బ్రహ్మను పూరించమని ఆజ్ఞాపించాడు. ఇది రెండో మత్స్యావతారం.

🌷మత్స్య జయంతి విధి విధానాలు🌷

🌿ఈ రోజు విష్ణుమూర్తి  ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించడం , ఉపవాస దీక్ష గావించడం వంటి వాటి ద్వారా ఆ దేవుని కృపకు పాత్రులవగలరని పురాణాల సారాంశం.

🌸ఒకవేళ ఈ ప్రత్యేకమైన రోజు ఉపవాస దీక్షను మరియు పూజలను వేకువ జామునే ఆరంభించగలిగితే , అదృష్టం వరించి మోక్ష మార్గానికి దారి సుగమం అవుతుందని చెప్పబడింది.

🌿మోక్షం ,ఈ ప్రత్యేకమైన ఉపవాస దీక్షలో , పూర్తిగా ఆకలితో ఉండాల్సిన అవసరం కూడా లేదు. పాలు పండ్లు స్వీకరించవచ్చు…స్వస్తి…🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸