🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌷సౌభాగ్యగౌరీ వ్రతం, సౌభాగ్యశయన వ్రతం, ఆందోలన వ్రతం🌷
🌿శివడోలోత్సవము చైత్ర శుద్ధ తృతీయ రోజు జరుపుకొనే పండుగ. వసంత నవరాత్రులు తొమ్మిది రోజులలో ఇది మూడోరోజు. మన పంచాంగకర్తలు దీనినే సౌభాగ్యగౌరీ వ్రతం,
🌸 సౌభాగ్యశయన వ్రతం, మాసగౌరీ వ్రతం, ఉత్తమ మన్వాది అని కూడా పేర్కొన్నారు. శివడోలోత్సవమునాడు ఉమా శివులను దమనముతో పూజించి డోలోత్సవం చేస్తే గొప్ప ఫలితాన్ని ఇస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.
🌿దీనిని ఆందోలన వ్రతమంటారు. ఈ వ్రతానికి విదియతో కూడిన తదియ పనికిరాదని, చవితితో కూడిన తృతీయ ముహూర్త మాత్రం ఉన్నా గ్రాహ్యమని స్మృతి కౌస్తుభం.
🌸ఈ డోలోత్సవ పర్వం హిందూదేశంలో పలుప్రాంతాల్లో పలురీతుల ఆచరింపబడుతూ ఉంది. ఆ ఆచరణ ఆయా ప్రాంతాల్లో స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది.
🌿అంతేగాక ఇది ప్రత్యేకం స్త్రీ దేవతపేర సౌభాగ్య గౌరీవ్రతం మున్నగు నామాలతో వ్యవహరింపబడుతూ ఉంది. ఈ పర్వం గౌరీ నామంతో చెలామణీ కావడానికి కారణం ఉంది.
🌸 దాక్షాయణి అగ్నికి ఆహుతి అయి చనిపోయి హిమవత్పర్వతానికి కూతురుగా పుట్టింది. పర్వతునికి పుత్రికగా పుట్టింది కాబట్టి ఈ జన్మలో ఆమెకు పార్వతి అనే పేరువచ్చింది.
🌿పార్వతి పర్యాయనామాల్లో గౌరి అనేది ప్రసిద్ధమైనది. ఆమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి తపస్సు చేసింది. ఆమె తపస్సు చైత్రమాసంలో శుక్ల తదియనాడు ఫలించింది.
🌸అందుచేత ఆనాడు గౌరి పేరున జరిగే ఒక పర్వమైంది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. సౌభాగ్యాన్ని , పుత్రపౌత్రాదులను , భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు.
🌿ఈ రోజు మత్స్య జయంతి కూడా. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి , వేదాలను రక్షించిన రోజు…స్వస్తీ…🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿