స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలే ఉన్నప్పటికీ ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో సూచీలు పడిపోతున్నాయి. అయితే ఇదే సమయంలో కొన్ని స్టాక్స్ ప్రైస్ వాల్యూమ్ బ్రేకవుట్‌ను నమోదు చేశాయి. ఆ స్టాక్స్ గురించి చూద్దాం.
అంతర్జాతీయంగా బలమైన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు పడిపోతున్నాయి. ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్న తరుణంలో ఈ పరిస్థితి ఉంది. అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు కూడా క్రితం సెషన్‌లో భారీగానే పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ అక్కడ వడ్డీ రేట్లు పెంచిన నేపథ్యంలో.. ఇన్వెస్టర్లలో కాస్త సెంటిమెంట్ పుంజుకుంది. దీంతో నాస్‌డాక్ కాంపోజిట్ సూచీ 1.01 శాతం పుంజుకుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.23 శాతం పెరిగింది. S&P 500 ఇండెక్స్ 0.3 శాతం లాభపడింది. అయినప్పటికీ దేశీయ మార్కెట్లలో సెన్సెక్స్ ప్రస్తుతం 50 పాయింట్లు పడిపోయి 57 వేల 860 మార్కు వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా కోల్పోయి 17 వేల 50 మార్కు వద్ద కదలాడుతోంది.
ఇక ప్రస్తుతం అపోలో హాస్పిటల్, కోటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, ఇన్పోసిస్, టీసీఎస్ రాణిస్తుండగా.. బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా స్టీల్, హిందాల్కో, బజాజ్ ఫినాన్స్ డీలాపడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.65 శాతం పెరగ్గా.. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.59 శాతం పుంజుకుంది. ఇక మార్కెట్లు పడుతున్న సమయంలోనే కొన్ని స్టాక్స్ ప్రైజ్ వాల్యూమ్ బ్రేకవుట్ నమోదు చేశాయి. ఆ స్టాక్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం.