మంచు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరి మధ్య కూడా గొడవలు మొదలైనట్లుగా గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విష్ణు ఇటీవల సోదరుడు పెళ్లికి కూడా రాలేదని, విభేదాలు ఉన్నట్లుగా వార్తలు అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు మనోజ్ ఏకంగా ఒక వీడియోను పోస్ట్ చేయడంతో విషయం మరింత వైరల్ గా మారిపోయింది. ఇక మొత్తానికి వైరల్ అయిన వీడియో పై మంచి విష్ణు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..
ముందు నుంచే గొడవలు? సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ ఇద్దరు కూడా చాలా మంచి సోదరులు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో మాత్రం వారిద్దరికీ మధ్య కొన్ని గొడవలు జరుగుతున్నట్లుగా కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. కానీ ఆ విషయంపై ఎవరూ కూడా పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు.
ఇద్దరి మధ్య దూరం ఇటీవల మంచు విష్ణు రెండవ పెళ్లి విషయంలో కూడా మంచి విష్ణు వసంతృప్తి గానే ఉన్నాడు అని ఏదో చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోయినట్లుగా కూడా మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ వారి పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి విషెస్ కూడా చెప్పుకోలేదని రకరకాల కథనాలు కూడా వెలువడ్డాయి.
వీడియో వైరల్ చాలా కాలంగా అయితే మోహన్ బాబు, విష్ణు కలిసి ఉంటుండగా మనోజ్ మాత్రం విడిగానే ఉంటున్నాడు. అయితే ఇప్పుడు హఠాత్తుగా మనోజ్ ఒక వీడియో పోస్ట్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విష్ణు చాలా సీరియస్ గా ఎవరి మీదనో దాడి చేయడానికి వెళ్లినట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. అంతేకాకుండా మనోజ్ తరచుగా ఇలా బంధువుల మీద దాడులు చేయడానికి వస్తూ ఉంటాడు అని ఆ వీడియోలో చెప్పినట్లుగా అర్థం అవుతుంది.
విష్ణు క్లారిటీ
మోహన్ బాబుకు ఎంతోకాలంగా చాలా సన్నిహితంగా ఉంటున్న సారథి అనే వ్యక్తి మీదనే విష్ణు ఈ విధంగా దాడి చేసినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయం మీడియాలో వైరల్ అవుతూ ఉండగా మంచు విష్ణు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని ఇంత పెద్దగా చేయాల్సింది కాదు అని మనోజ్ చిన్నవాడు అని స్పందించాల్సిన అంత పెద్ద విషయం కూడా కాదు అని విష్ణు వివరణ ఇచ్చాడు.
అలా చేయాల్సింది కాదు
కుటుంబంలో ఇలాంటివి సర్వసాధారణమని ఇది చాలా చిన్న విషయమే అని మనోజ్ వీడియో పెట్టి ఈ విధంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని విష్ణు తెలియజేశాడు. అలాగే మా ఇద్దరి మధ్య సాదరణ గొడవ అని కూడా విష్ణు మీడియాకు తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయంలో మంచి మోహన్ బాబు ఇప్పటికే ఇద్దరి సోదరులను కూడా పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్లు సమాచారం.