NRI-NRT

మారిషష్ లో తెలుగు కీర్తిని చాటుతున్న సంజీవ అప్పడు..

మారిషష్ లో  తెలుగు కీర్తిని చాటుతున్న సంజీవ అప్పడు..

మారిష స్లో లో తెలుగు కీర్తిని చాటుతు న్నారు సంజీవ నరసింహ అప్పడు. మారిషస్లో ఆయన చేసిన తెలుగు భాషా సేవలు, హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశాల్లో సామాజిక పురోగతికి చేసిన కృషిని గుర్తించి భారత్-మారిషస్ ప్రభుత్వాలు అత్యంత అప్పుడు ప్రతిష్టాత్మకమైన ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషన్ పురస్కారాన్ని ఆ దేశా ధ్యక్షుడు పృధ్వీరాజ్సింగ్ రూపన్ చేతుల మీదుగా అందుకున్నారు. సంజీవ నరసింహ అప్పడు తాత ముత్తాతలది విజయనగరం. ఆ రోజుల్లో ఆంగ్ల దొరలు మారిషస్ దేశంలో పని మనిషులు కావాల్సి వచ్చి, సముద్ర తీరాలకు ఉన్న గ్రామాల్లోని ప్రజలను అక్కడికి తీసుకువెళ్లే వారు. ఈ క్రమంలో సంజీవ నరసింహ అప్పుడు తాత ముత్తాతలు 1894లో మారిషస్ వెళ్లి స్థిరపడ్డారు. తాతల నుంచి వస్తున్న తెలుగు వ్యాకరణాన్ని అవపోసన పట్టిన ఈయన మారిషస్ విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ నుంచి తెలుగు బీఏ(ఆనర్స్) లో పట్టా అందుకున్నారు. మారిష స్లో లో తెలుగు వ్యాప్తి కోసం సంజీవ నరసింహ అప్పుడు చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించింది. అక్కడి 320 విద్యాలయాల్లో తెలుగు బోధన అధికారిగా నియమించింది. పాఠ శాలల్లో అన్ని తరగతులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, పరీక్ష పత్రాలు తానే రూపొందిస్తారు. మారిషస్ జాతీయ ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల్లో తెలుగు విభాగాధిపతిగా పనిచేస్తు న్నారు. రోజూ నాలుగు గంటల పాటు తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు చేస్తుండగా వాటి రూపకల్పన, వ్యాఖ్యాతగానూ పనిచేస్తున్నారు. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని రావి ఆకులపై 1400 పైగా చిత్రాలు చిత్రించి గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు.