తానా మాజీ అధ్యక్షుడు ప్రముఖ ఎన్నారై తాళ్లూరి జయ శేఖర్ కుటుంబం తమ స్వగ్రామం భద్రాచలం సమీపంలోని విరివెండి గ్రామంలో భారీ స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూరి విరాళాలు అందిస్తున్నారు. జయ శేఖర్ మాతృమూర్తి స్వర్గీయ భారతీదేవి పేరు మీదగా గ్రామంలో యూపీ పాఠశాలకు భవనాలను నిర్మించి ఇచ్చారు. ఈ భవనాలకు స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇటీవల ప్రారంభోత్సవం చేశారు. తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే కాంతారావు ప్రశంసించారు.