DailyDose

TNI తాజా వార్తలు.. అయ్యన్న ఇంటికి పోలీసులు..

TNI తాజా వార్తలు.. అయ్యన్న ఇంటికి పోలీసులు..
  • Vizag

*  రామ జోగిపేట భవనం కూలిన ఘటనలో మృత దేహాల పోస్ట్ మార్టం పూర్తి

అంత్య క్రియల ఖర్చులు అందజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున

..మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది వేలు చొప్పున సహాయం అందించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

ఎమ్మెల్యే వాసూపల్లి గణేష్ కుమార్

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

వైయస్సార్ బీమా తరుపున ఒక్కో మృతుని కుటుంబానికి 5 లక్షల చెప్పున పరిహారం అందజేస్తాం

గాయపడిన రామారావు కళ్యాణి దంపతులకు సొంత ఇంటిని మంజూరు చేస్తున్నాం

రామారావు కుటుంబం సొంత ఇంటిలో చేరేవరకు వారి ఇంటి అద్దెను స్వయంగా భరిస్తా

… విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి….

సాకేటి రామారావు అతని భార్య కళ్యాణి కోలుకుంటున్నారు

కళ్యాణికి ఆపరేషన్ విజయ వంతం అయ్యింది

మరో ఇద్దరు పూర్తి గా కోలుకున్నారు

త్వరలో డిశ్చార్జ్ చేస్తాం

…కేజీ బీచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్

  • అనకాపల్లిజిల్లా :

*  నర్సీపట్నంలో మరోసారి అయ్యన్న ఇంటికి వచ్చిన రాజమండ్రి సిఐడి పోలీసులు

ఈ నెల 28 అయ్యన్న తనయుడు, టిడిపి ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఇంటి స్థలం వివాదంలో ఫోర్జరీ కేసు విషయమై గుంటూరు సిఐడి కార్యాలయంలో హాజరు కావాలంటూ నోటీసులు జారీ…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే బీసీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించిన మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు…

అధికార మదంతో ఇంకెన్నాళ్ళు బీసీల గొంతు నొక్కుతారని మండిపడ్డ అయ్యన్న….

  • పల్నాడు జిల్లా వినుకొండ:

*  క్వారీ లో ప్రమాదం ఇరువురు మృతి…మరో ఇరువురు కి తీవ్ర గాయాలు.

వినుకొండ: పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డు లోని ఒక క్వారి లో ప్రమాదం… ఇరువురు వ్యక్తులు మృతి…మరోక ఇద్దరికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు….పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

బ్రేకింగ్ న్యూస్…

  • సూర్యాపేట జిల్లా కోదాడ

*  మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.

టాక్టర్ నీ ఢీకొట్టిన లారీ,ఇద్దరు మహిళ అక్కడికక్కడే మృతి ఇద్దరు మహిళల పరిస్థితి విషమం.

హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ, ఆకు పాముల వద్ద ఉన్న టాక్టర్ నీ డి కొట్టడంతో.. రోడ్డు ప్రమాదం.

జాతీయ రహదారిపై ఉండే GMR కార్మికులుగా గుర్తింపు.

మృతులు నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన వినోద,తుమ్మల దనమ్మలు గా గుర్తింపు…

 

◾ || తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముకుమ్ముడి రాజీనామాలు …❓ || ◾

▪️తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ రాజీనామాల అస్త్రం ఏ విధంగా అయితే ఉపయోగించిండో దాన్నే ఫాలో అవ్వబోతున్న కాంగ్రెస్ హైకమాండ్.

▪️కాంగ్రెస్ ఎంపిలు ముకుమ్ముడి రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం… ❓

శ్రీకాకుళం: గుండెపోటుతో ఏఎస్ఐ మృతి

శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రం కవిటి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న దిండు భాస్కరరావు గుండెపోటుతో మరణించారు. ఇచ్చాపురంలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి భోజనం అనంతరం మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న కవిటి పోలీస్ సిబ్బంది తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. మృతి చెందిన ఏఎస్ఐ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఎస్పీ రాధిక తెలిపారు.

◾ || జైలుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న రాహుల్ గాంధీ …❓ || ◾

▪️ఇందిరాగాంధీ ఆదర్శంగా రాహుల్ గాంధీ అడుగులు.

▪️1977 లో అనర్హత వేటు పడినప్పుడు కొద్ది రోజులు జైల్లో ఉన్న ఇందిరాగాంధీ.

▪️రాహుల్ కు మద్దతుగా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడుతున్న కాంగ్రెస్ ఎంపీలు.

*  జగిత్యాల పట్టణంలో చైన్ స్నాచర్ కు దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత

పట్టణంలోని బైపాస్ రోడ్ లో కృష్ణానగర్ కు చెందిన రంగ లలిత అనే మహిళ తన స్నేహితులతో కలిసి లో సాయిబాబా గుడిలో జరుగుతున్న అఖండ సాయి నామ సప్తాహం లో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా బైపాస్ రోడ్ లో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెను అడ్డగించి, ఆమె మెడలో ఉన్న పుస్తెలు తాడును లాక్కొని పారిపోతుండంగా. స్థానికులు నిందితులను వెంబడించారు, దొంగ బైపాస్ రోడ్డు నుంచి శివసాయి లాడ్జి వరకు దొంగ పరిగెత్తుకుంటూ పారిపోయే ప్రయత్నం చేయగా,cస్థానికులు దొంగలు పట్టుకొని దేహశుద్ధి చేసి పట్టణ సీఐ కిషోర్ కు సమాచారం అందించగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దొంగను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించి విచారిస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

దొంగతనానికి పాల్పడిన ఇద్దరు మల్యాల మం. నూకపల్లి కి చెందిన వారుగా తెలిసింది.,