వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
– 2024లో జరిగే ఎన్నికలకు సంబంధించి వైసీపీ భవితవ్యంపై జోస్యం చెప్పారు.
★ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
★ మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి.. నిన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో దెబ్బ మీద దెబ్బ పడ్డట్లైంది.
★ నమ్ముకున్న ఎమ్మెల్యేలే తమని మోసం చేశారని నమ్మిన వైసీపీ.. నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
★ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చి 24గంటలు కూడా కాకముందే ఎమ్మెల్యేలపై అధికార పార్టీ వేటు వేయడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.
★ తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ అయిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి 2024లో జరగబోయే ఎన్నికల గురించి జోస్యం చెప్పారు.
★ “ముఖ్యమంత్రి జగన్ నన్ను అనుమానించారు. ఆ తర్వాత వైసీపీకి దూరం జరుగుతున్నట్లు రెండు నెలల ముందే చెప్పా. ప్రజాసమస్యల గురించి ప్రశ్నిస్తే.. వాటిని రాజకీయ కోణంలో చూసి అనుమానించారు. అందుకే నేను దూరం జరిగా” అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.
★ 2024లో రాష్ట్రంలో రాజకీయ సునామీ రాబోతోందని.. ఆ సునామీలో వైసీపీ డిస్మిస్ అవుతుందని.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జోస్యం చెప్పారు.
★ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఇందుకు సంకేతాలని స్పష్టం చేశారు.
★ చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని కోటంరెడ్డి తెలిపారు.
★ కొందరు బహిరంగంగా బయటకు వస్తున్నారని.. చాలా మంది లోపల ఉడికిపోతున్నారని విమర్శించారు.
★ మరో పార్టీ కోసం ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని తెలిపారు.
★ రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికలకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
★ “వైసీపీ నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు బయటికి వస్తారో నాకు తెలియదు. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న మాట నిజం. కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగా ముందుకు వచ్చారు. మరికొంతమంది లోపల రగిలిపోతున్నారు” అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.
★ రానున్న 2024 ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ ప్రజా సునామీ రాబోతుంది.
★ ప్రజలు కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా వైసీపీను ప్రజలు శాశ్వతంగా బహిష్కరించనున్నారని.. తడ నుంచి ఇచ్ఛాపురం వరకు వైసీపీ ఓటమి పాలవుతుందని శ్రీధర్ రెడ్డి విమర్శించారు.
★ చాలా మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని స్పష్టం చేశారు. అయితే సస్పెండ్‌పై స్పందించిన కోటంరెడ్డి.. వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం సమర్ధనీయమని.. కానీ ఆ విధానం మాత్రం ప్రజాస్వామిక సూత్రానికి విరుద్ధం అని తెలిపారు.
★ షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయకూడదని పేర్కొన్నారు.
★ డబ్బులకు అమ్ముడుపోయినట్లు సజ్జల మాట్లాడటం సరికాదన్నారు.
★ టీడీపీ, జనసేన నుంచి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలకు మీరు ఎంత ఇచ్చి కొన్నారో చెప్పాలని నిలదీశారు.
★ “”ప్రజలు మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీని శాశ్వతంగా బహిష్కరిస్తారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా సునామీ రాబోతుంది. ఆ సునామీలో వైసీపీ కొట్టుకుపోతుందని ఘంటాపథంగా చెపుతున్నా” అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.