DailyDose

కొడుకును కొట్టి చంపిన తల్లిదండ్రులు

కొడుకును కొట్టి చంపిన తల్లిదండ్రులు

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాంనూర్ గ్రామానికి చెందిన కుదురుపాక భూమయ్య రాజమ్మ ల కుమారుడు మహేష్( 35 ) తాగుడుకు బానిసైన మహేష్ రోజు కుటుంబ సభ్యులతో నిత్యం గొడవ పడుతుండడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది రోజు లాగనే కల్లుకు డబ్బులు కావాలని తల్లిదండ్రులను అడగగా లేవు అనడంతో వారితో గొడవపడ్డాడు, నిత్యం మహేష్ తో విసిగిపోయిన తల్లిదండ్రులు. మరో ఇద్దరి సహాయంతో మహేష్ ను తీవ్రంగా కొట్టారు. గాయాలైన మహేష్ ను యాక్సిడెంట్ కేసుగా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి చనిపోయాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు…