Politics

పెద్దిరెడ్డి బాధితులందరికీ న్యాయం చేస్తా : లోకేశ్‌..

పెద్దిరెడ్డి బాధితులందరికీ న్యాయం చేస్తా : లోకేశ్‌..

పుట్టపర్తి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులందరికీ న్యాయం చేస్తానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ భరోసా ఇచ్చారు..

సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఇవాళ లోకేశ్‌ పాదయాత్ర కొనసాగింది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ యాత్రలో పాల్గొని యువనేతకు సంఘీభావం తెలిపారు. రామయ్యపేట నుంచి ప్రారంభమైన పాదయాత్రలో భారీ సంఖ్యలో నాయకులు, తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి లాక్కున్న క్వారీలన్నీ..బాధితులకు తిరిగి ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని లోకేశ్‌ హామీ ఇచ్చారు. వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు..

తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వశాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర నష్టం చేసిందన్నారు. దిశ చట్టంపేరుతో మహిళలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.మరోవైపు లోకేశ్‌ పాదయాత్ర ఇవాళ పెనుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. గోరంట్ల మండలం గౌనివారిపల్లె వద్ద లోకేశ్‌కు తెదేపా నేతలు స్వాగతం పలికారు. లోకేశ్‌ పాదయాత్రలో పార్టీ సీనియర్‌ నేతలు నిమ్మల కిష్టప్ప, పార్థసారథి, సవితమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 14 కి.మీ పాద యాత్ర చేసిన లోకేశ్‌.. గోరంట్ల మండలం రెడ్డిచెరువుకట్ట విడిదికి చేరుకున్నారు..