నటుడు ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్
సినీ నటుడు ప్రకాష్ రాజ్ శనివారం సంచలన ట్వీట్ చేశారు. ఓ వైపు లలిత్ మోడీ. మరో వైపు నీరవ్ మోడీ. మధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ముగ్గురిలో కామన్ ఉన్నది ఏంటని క్యాప్షన్ పెట్టారు. ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన ఎంపీ పదవి కోల్పోయారు. రాహుల్కు మద్దతుగా ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేశారు.