కెనడాలో తాకా వారి శోభకృతు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు
కెనడాలో తెలుగు అలయన్సస్ అఫ్ కెనడా (తాకా) మార్చి 25, 2023 శనివారం నాడు శోభకృతు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను టొరంటోలోని టొరంటో పెవిలియన్ వేదిక నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమమును 1500 మందికి పైగా కెనడా లోని తెలుగు వారు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి అనిత్ సజ్జ, ఖాజిల్ మొహమ్మద్, విద్య భవనం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మొదటగా ధనలక్ష్మి మునుకుంట్ల, స్వప్న పసునూరి, వాణి జయంతి, రాఖి ఆత్మకూరి, సుధారాణి దూదరి జ్యో తి ప్రజ్వలన తో ఉగాది ఉత్సవాలను ప్రారంభించారు. పిమ్మట కెనడా దేశ జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది.తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి గారు కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు వారందరికీ స్వాగతం పలికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి టొరంటో పనోరమా ఇండియా చైర్మన్ శ్రీమతి వైదేహి భగత్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది.
వైదేహి గారు కెనడాలోని తెలుగు కమ్యూనిటీ కోసం తాకా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి కొనియాడారు. జోరు వానలో కూడా కిక్కిరిసి పోయిన ప్రజానీకాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అధ్యక్షులు కల్పనా మోటూరి మరియు తాకా కార్యవర్గ సంఘం శ్రీమతి వైదేహి భగత్ గారిని గౌరవం గా సత్కరించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ప్రధాన ధాత అయిన రియల్ ఎస్టేట్ మొఘుల్ రామ్ జిన్నాల గారికి కార్యవర్గం తరపున ధన్యవాదములు తెలియ చేసారు. కల్పన మోటూరి గారు తాకా విశిష్టత తెలియ చేస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు
టొరంటో లో ఉన్న మన తెలుగు పూజారి నరసింహచార్యులు గారు ఉగాది పంచాంగ శ్రవణం మరియు ఈ కొత్త సంవత్సరం రాశి ఫలాలను అందరికీ వివరించారు. తాకా కార్యవర్గం ప్రతి సంవత్సరం ఉగాది పురస్కారాలు అందచేయడం ఆనవాయితీ. ఈ సంవత్సరం ఎన్నో విశిష్ట సేవలు తెలుగు కమ్యూనిటీకి చేస్తున్న చారి సామంతపూడి (సమాజ సేవ), దీప సాయిరాం (కళలు, సంస్కృతి), నరేంద్ర పాతూరి (తెలుగు భాష), శ్రీదేవి పిల్ల (క్రీడలు) విభాగంలో ఉగాది గౌరవ పురస్కారాలు అందించి, ముఖ్య అతిధి వైదేహి మరియు తాకా కార్యవర్గం సత్కరించారు. 7 గంటల పాటు 40 సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా మరియు ఉత్సా హంగా సాగింది. దాదాపు 200 మందికి పైగా చిన్నా రులు మరియు కళాకారులు చేసిన తెలుగు సాంస్కృతిక మరియు చలన చిత్ర నృత్య ప్రదర్శనలు, పాడిన గీతాలు అందరినీ అలరించాయి. సిలికాన్ ఆంధ్ర మనబడి చేసిన రామాయణం నాటకం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచి అందరి మన్ననలు పొందింది. ఫుడ్ డైరెక్టర్ గణేష్ తెరల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చేపించిన వంటకాలతో ఉగాది విందును ఏర్పరిచారు
తాకా కార్యవర్గం మార్చి 12న ఇన్డోర్ స్పోర్ట్స్ (చెస్, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, క్యారమ్స్ ) పోటీలు అరుణ్ లయం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇన్డోర్ స్పోర్ట్స్ విజేతలు విలాస్ సమ్మి నేని, ప్రాణేష్ ఆళవందార్, నీలిమ, సుధా ఆర్కట్, బృంద భారతీరాజా, దివ్య ఆర్కట్, ప్రత్యు ష్అ శోక్, వివాన్ గోయల్, రామ్ నేర్సు , కుమార్ చందు, అరుణ్ లయం, నవీన్ గోవిందు, విపిన్ కుమార్, కిరణ్ నాయుడు,శివ చైతన్య, అవంతి మండలి, లక్ష్మీ శశి, సుధా, దివ్య, అశ్విత్ వరగంటి, జయ సింహ, శ్రీకాంత్ ఏలూరి, రాగసుమన్,చెన్నా కా, శ్రీరామ్ గొర్తి, జనార్దన్ సదారి, సాత్వి క్ తరలి, అభిరాం నెర్సు , అభిరాం కొండతాసుల, భారతి రాజా, అవినాష్,బంగారు, దివ్య కామిశెట్టి, వాసవి నగరకంటి, సౌరిస్ థాకల్, సాత్విక్ తారల, యశశ్విని లక్ష్మీ మొమెంటో మరియు సర్టిఫికెట్ అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి,కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ, డైరెక్టర్లు గణేష్ తెరాల,రాణి మద్దెల, శృతి ఏలూరి, ప్రదీప్ రెడ్డి ఏలూరు, యూత్ డైరెక్టర్ విద్య భవనం, ఖాజిల్ మహమ్మద్, ఆడియో, వీడియో విభాగం లో రవీంద్ర సామల, ఆదిత్య వర్మను, మరియు బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక మరియు తాకా వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, అరుణ్ లయం ,లోకేష్ చిల్లకూరు,రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరు, రామచంద్ర రావు దుగ్గిన మరియు అందరి వాలంటీర్లను తాకా అధ్యక్షులు కల్పన మోటూరి గారు అభినందించారు. చివరిగా భారత దేశ గీతం ఆలపించి, కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, దాతలకు, అతిధులకు తాకాకార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి గారు ఇచ్చిన వందన సమర్పణతో కార్యక్రమం జయప్రదంగా ముగిసింది