NRI-NRT

తానా ఎన్నికలు 2023:- దూకుడు పెంచిన గోగినేని గ్రూప్

తానా ఎన్నికలు 2023:- దూకుడు పెంచిన గోగినేని గ్రూప్ - TANA 2023 Election Updates - Gogineni vs Kodali

తానా ఎన్నికలు. దూకుడు పెంచిన గోగినేని గ్రూప్..

తానా ఎన్నికలపై ఇంకా అనిశ్చిత పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుటం లేదు. కోర్టు తీర్పు రావాలంటూ ఎన్నికల సంఘం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మొన్న 23వ తేదీన కోర్టు ఆదేశాలు వస్తాయని దాని ప్రకారం ఎన్నికలు జరపాలని తానా బోర్డు తో పాటు ఎన్నికల సంఘం ఎదురుచూసినట్లు సమాచారం. ఏప్రిల్ రెండవ తేదీకి కోర్టు తీర్పు వాయిదా పడినట్లు తెలిసింది. కోర్టు నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

పారదర్శకత ఏది..

తానా ఎన్నికల కోసం నియమించిన అధికారుల బృందం గోప్యత పాటిస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఎన్నికలు నిర్వహించలేనప్పుడు దానికి గల కారణాలను నామినేషన్లు వేసిన అభ్యర్థులకు తెలియజేయాలి. కనీసం తానా బోర్డు అయిన వివరణ ఇవ్వాలి. ఎన్నికల సంఘం, బోర్డు మౌనంగా ఉండటంతో పోలింగ్ ఎప్పుడు జరుగుతుందని విషయం తెలియక అటు పోటీలో ఉన్న అభ్యర్థులు ఇటు తానా సభ్యులు గందరగోళానికి గురి అవుతున్నారు.

దూకుడు పెంచిన గోగినేని వర్గం.

తానా మాజీ అధ్యక్షుడు జయ శేఖర్ తాళ్లూరి తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన గోగినేని శ్రీనివాస్ తమ ప్యానెల్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఈరోజు ప్రకటించారు. దీనితో తానా ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడిందనే అభిప్రాయం సభ్యులలో వ్యక్తం అవుతోంది. గోగినేని ప్యానెల్ లో పోటీ చేస్తున్న కొల్లా అశోక్, తూనుగుంట్ల శిరీష, యార్లగడ్డ శశాంక్, సామినేని రవి, శ్రీని ఎలవర్తి తదితరులు కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నేడు గాని రేపు గాని కొడాలి వర్గం తమ ప్యానెల్ ను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఏ విధమైన వివాదాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఇరువర్గాలు ఎన్నికల ప్రచారం నిర్వహించాలని తానా పరువు ప్రతిష్టలకు భంగం కలుగకుండా చూడాలని తానా పెద్దలు, సభ్యులు కోరుకుంటున్నారు

కిలారు ముద్దుకృష్ణ
సీనియర్ జర్నలిస్ట్