కేదార్నాథ్ భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. heliyatra.irctc.co.in అనే ప్రత్యేక పోర్టల్లో ఏప్రిల్ 1 నుంచి బుకింగ్స్ చేసుకోవచ్చు. హెలికాప్టర్లో వెళ్లాలనుకునేవారు కచ్చితంగా ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కేదార్నాథ్కు 200 కిలోమీటర్ల పరిధిలోని హెలీప్యాడ్ల నుంచి సేవలు అందుబాటులో ఉంటాయి.