Politics

కర్నాటక ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహం ఇదేనా..? తొలి అగ్నిపరీక్షకు BRS సిద్దమేనా..?

కర్నాటక ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహం ఇదేనా..? తొలి అగ్నిపరీక్షకు BRS సిద్దమేనా..?

బీఆర్‌ఎస్‌ అక్కడ పోటీ చేయబోతుందా..? లేక జేడీఎస్‌కు మద్దతు ఇస్తుందా..? అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్నలు. అయితే, కుమార స్వామికి మద్దతు పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..

జాతీయపార్టీగా విస్తరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపింది కర్నాటకకు చెందిన కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌. మరి బీఆర్‌ఎస్‌ అక్కడ పోటీ చేయబోతుందా..? లేక జేడీఎస్‌కు మద్దతు ఇస్తుందా..? అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్నలు. అయితే, కుమార స్వామికి మద్దతు పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సీఎం కేసీఆర్. మొదటి నుంచి బిఆర్ఎస్‌తో కలిసిమెలిసి ఉంటున్న కుమార స్వామి.. పోటికన్నా కుమార స్వామికి మద్దతు ఇవ్వడం వైపే బిఆర్ఎస్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర పై పూర్తిగా దృష్టి పెట్టింది బిఆర్ ఎస్. సీఎం కేసీఆర్ గ్రీన్ ఇస్తే ఉమ్మడి పాలమూరు జహీరాబాద్ నేతలు కర్నాటక ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యే అవకాశం ఉంది.

జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్‌ఎస్ మొదటి టార్గెట్‌గా మహారాష్ట్రను పెట్టుకుంది. అంతేకాదు తెలంగాణకు సరిహద్దుతో కలిసి ఉన్న రాష్ట్రాలను మొదట టార్గెట్ చేస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇందు కోసం బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నేతలను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో రెండు బహిరంగ సభలు పెట్టారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) స్వయంగా పాల్గొన్నారు. అయితే, ఇప్పుడు కర్నాటకలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఎలా ఉండనుంది..? ప్రత్యేక్షంగా ఎన్నికల్లో పోటీ చేస్తారా..? లేదంటే మిత్రపక్షమైన జేడీయూతో మద్దతు తెలుపుతారా..? అన్నది తేలాల్సి ఉంది. మద్దతు తెలిపినా, ప్రత్యేక్షంగా ఎన్నికల్లో పాల్గొనాలనేదానిపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోక పోనప్పటికీ.. ఆ రాష్ట్ర ఎన్నికల్లో తన మార్కును చూపించాలని అనుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ.

ఇప్పటికే ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల సరిహద్దులు కర్నాటకతో కలిసి ఉన్నాయి. అయితే కర్నాటక సరిహద్దుల్లో్ ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పోటీ చేయాలని అనుకుంటోంది. అంతేకాదు ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లపై ప్రభావితం చేస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ చాలా సార్లు ప్రకటించింది.

మక్తల్, నారాయణఖేడ్‌,కొడంగల్, తాండూరు ఇలా చాలా నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు కావడం.. వీరి నియోజకవర్గాలు కర్నాటక సరిహద్దుగా ఉంది. వీరంతా జేడీయూకు మద్దతుగా ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. కుమార స్వామితో చర్చలు జరిపి మద్దతుగా నిలుస్తారా..? లేదా స్వయంగా పోటీ చేస్తారా అనేది వేచి చూడాలి. మరో రెండు మూడు రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

కానీ కర్నాటక ఎన్నికలపై మాత్రం ఇంత వరకూ ఎలాంటి ఆలోచనలు చేయలేదని తెలుస్తోంది. ఇప్పుడు కర్నాటక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కానీ కర్నాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్లాన్ ఎలా ఉంటుందన్నదనిపై స్పష్టత రాలేదు. ఏపీ, ఒడిషా లాంటి రాష్ట్రాలకు బీఆర్ఎస్ శాఖల అధ్యక్షుల్ని ఖరారు చేశారు కానీ కర్ణాటక విషయంలో మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఎవరినైనా చేర్చుకునే ప్రయత్నాలు కూడా చేయలేదు.

కర్నాటక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా బీఆర్ఎస్ ఎలాంటి అడుగులూ వేయలేదంటే కారణం ఏంటో అర్థం కావడం లేదు. ఈ మౌనం వెనుక ఏదైనా ప్లాన్ ఉందా..? లేక ఇదంతా కేసీఆర్ వ్యూహామని.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ ఎప్పుడూ అనకుకోలేదని.. జేడీఎస్‌కు మద్దతిస్తారని అటంటున్నారు.