విదేశీ యాత్రైనా, చదువైనా, ఉద్యోగమైనా భారతీయులకు ముందుగా గుర్తొచ్చేది అమెరికాయే.( America ) అంతగా భారతీయుల జీవితంతో అగ్రరాజ్యం అనుబంధం పెంచుకోంది.
ఇక చదువు, ఉద్యోగాలకు సంబంధించిన వీసాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే యూఎస్ విజిటింగ్ వీసా ఇంటర్వ్యూ కోసం భారత్‌లో వేచి వుండే సమయం 60 శాతం మేర తగ్గిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఈ ఏడాది 1 మిలియన్ వీసాలను జారీ చేయాలన్నది తమ లక్ష్యమని డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ వీసా సర్వీసెస్ జూలీ స్టఫ్ట్( Julie Stufft ) పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.ఇది కోవిడ్‌కి ముందు నాటి కంటే ఎక్కువని జూలీ అన్నారు.
భారతదేశానికి కాన్సులర్ అధికారుల కేడర్‌ను పంపపడంతో పాటు వీసా దరఖాస్తుదారుల కోసం జర్మనీ, థాయ్‌లాండ్‌లలో రాయబార కార్యాలయాలను తెరుస్తున్నట్లు ఆమె తెలిపారు.ప్రధానంగా భారత్‌లో వీసా నిరీక్షణ సమయాన్ని తొలగించేందుకు అమెరికా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె స్పష్టం చేశారు.
ఈ మేరకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీసా కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడం తమ తొలి ప్రాధాన్యత అని జూలీ అన్నారు.భారతదేశంలో తమ ఎంబసీ , కాన్సులేట్‌లలో ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న తమ సిబ్బందికి సహాయం చేయడానికి తాము కాన్సులర్ అధికారుల కేడర్‌ను పంపుతున్నట్లు తెలిపారు.పగటిపూట షిఫ్ట్‌లతో పాటు వారంతాల్లోనూ విరామం లేకుండా పనిచేస్తున్నారని జూలీ పేర్కొన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద వీసా కార్యకలాపాలు నిర్వహించే దేశాల్లో అమెరికా ఒకటన్న ఆమె.
భారతదేశం నుంచి విద్యార్ధులు, టెక్ కార్మికులు, శాశ్వతంగా యూఎస్ఏలో స్థిరపడేవారికి వీసాలు అందజేస్తున్నట్లు జూలీ తెలిపారు.గతేడాది అత్యధికంగా స్టూడెంట్ వీసాలు అందుకున్న రికార్డును భారతదేశం బద్ధలు కొట్టిందని ఆమె గుర్తుచేశారు.ఈ ఏడాది మరోసారి అదే రీపిట్ అవుతుందని, అమెరికాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్ధుల విషయంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో స్థానంలో వుందని జూలీ పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా అమెరికన్ దౌత్య కార్యాలయాలు భారతీయులకు వీసాలను జారీ చేస్తున్నాయని ఆమె చెప్పారు.