WorldWonders

ఏమిటీ ముత్యాల తలంబ్రాలు ? ఎందుకా రంగు?

ఏమిటీ ముత్యాల తలంబ్రాలు ? ఎందుకా రంగు?

🔅 భద్రాచలం ఆలయం గురించి ప్రతీ విషయం ఓ ప్రత్యేకత సంతరించుకున్నవే. ఇక్కడ జరిగే ఆచార వ్యవహారాలు అంతే.

🔅మనందరికీ కళ్యాణ తలంబ్రాలు అనగానే గుర్తుకు వచ్చేది పసుపుమయం. కానీ ఇక్కడ మాత్రం గుర్తుకు రావలసింది గులాబీమయం. ఈ ఆలయం తానీషా ప్రభువు ల కాలంలో రామదాసు గారి చే నిర్మింపబడినదని అందరికీ విదితమే. ఇక ఈ ప్రత్యేక కళ్యాణ తలంబ్రాలు ఎలా చేస్తున్నారో చూద్దాం.

🔅ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి (హోళీ)నాడు బుక్కా, గులాలు, అత్తరు, పన్నీరు, ఆవునెయ్యి, బియ్యం (తండూలాలు) తో కళ్యాణ తలంబ్రాలు కలుపుతారు.ఇదే రోజున రాములవారు పెళ్లికొడుకు అవుతారు.
ఇక్కడ ఈ విధంగా తలంబ్రాలు కలపడం తానీషా ప్రభువుల కాలం నుండి అనాదిగా వస్తున్న ఆచారం.
ముత్యాల తలంబ్రాలను పట్టువస్త్రాలతో ప్రభుత్వం తరుపున ప్రతీ శ్రీ రామ నవమి రోజున భద్రాచల క్షేత్రం లో సమర్పించడం కూడా తానీషా వారి సంకల్ప ఆచార వ్యవహారమే.

🔅ఓ ముత్యము దొరికన చాలు ఆ సీతారాముల దివ్య ఆశీస్సులు పొందడానికి అన్నట్టు తాపత్రయ పడే భక్తబ్రృందం చూస్తే ఆ ముత్యాల తలంబ్రాల ప్రత్యేకత ఎంతటిదో తెలుస్తుంది.