Politics

సీఎం జగన్ కి బహిరంగ లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్

సీఎం జగన్ కి బహిరంగ లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నా.. విద్యార్దులకు ఒంటిపూట ఒడులు ఎందుకు నిర్వహించరు?

ఉపాధ్యాయులపై కక్షసాధింపు కోసం విద్యార్దుల ప్రాణాలతో చెలగాటమాడుతారా ?

భానుడి ప్రతాపానికి బయటకు రావాలంటే పెద్దవాళ్లే భయపడుతున్నారు, చిన్న పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ స్కూల్లో ఎలా ఉండగలరు?

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి మొదటి లేదా రెండో వారంలో ఒంటిపూట బడులు పెట్టడం దశాబ్ధాలుగా అమలవుతోంది

కానీ మార్చి నెలాఖరు దాటిపోతున్నా ఒంటిపూట బడులు ఎందుకు నిర్వహించరు?

ఉపాధ్యాయులపై కక్షసాధింపు కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతారా?

ఒంటి పూట ఒడులు ఎప్పుడంటూ అడిగిన పాపానికి ఉపాధ్యాయులపై విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేయడం సిగ్గుచేటు

ఒంటిపూట బడులు పిల్లలకా? మీకా అంటూ టీచర్లను మంత్రి చులకనగా మాట్లాడటం నీతిమాలినచర్య

ఏసీ రూముల్లో, ఏసీ కార్లలో తిరిగే ముఖ్యమంత్రి, మంత్రులకు స్కూలు పిల్లల కష్టాలు ఏం తెలుస్తాయి?

ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయులపై కక్షసాధింపు ధోరణి వీడి ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలి