ద్రాక్ష.. చూస్తేనే నోరూరే ఈ పళ్లను పండ్లల్లో రాణిగా పురాణకాలం నుంచి ప్రసిద్ధిగాంచినవి.
ఈ చిన్న పండ్ల మూలాలు ఐరోపా, మధ్యధరా ప్రాంతాల్లో ఉన్నాయి. ద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్), యాంటీఆక్సిడెంట్స్ తోపాటు ఆరోగ్యాన్ని పెంపొందించే వివిధ రకాల ఫైటోన్యూట్రియెంట్స్ అత్యధికంగా ఉంటాయి. వాటి ఆరోగ్య ప్రయోజనాలు, వాటి రుచి కారణంగా ద్రాక్షపళ్లను ఎక్కువగా తీసుకుంటారు.
ఆకుపచ్చ ద్రాక్ష:
మనం చాలా ఇష్టంగా తింటాం. ఇందులోనూ చాలా రకాల ద్రాక్షలు దొరుకుతాయి. కొన్ని చాలా తీపిగా ఉంటాయి. మరికొన్ని పుల్లగా ఉంటాయి. ఫ్రూట్ సలాడ్, Grapes)ను ఉపయోగిస్తారు. ఒక కప్పు ఆకుపచ్చ ద్రాక్షలో 104 కేలరీల పోషకాలు, 1.4 గ్రాముల ప్రొటీన్, 0.2 గ్రాముల కొవ్వు, 27 గ్రాముల పిండి పదార్థాలు, విటమిన్ సి, విటమిన్ కె(Vitamin K) ఉంటాయి. ఇవ్వి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ K రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.
నల్ల ద్రాక్ష:
నల్ల ద్రాక్ష(Black _ Grapes)లో చాలా రకాలు ఉన్నాయి. పుల్లని, తీపి కలిగి ఉంటాయి. తరచుగా జ్యూస్ తయారీలో ఉపయోగిస్తారు. ఇది వైన్(Wine) తయారీలో కూడా ఉపయోగిస్తారు. నల్ల గింజలు లేని ద్రాక్ష కూడా విరివిగా లభ్యమవుతాయి. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఒక కప్పు నల్ల ద్రాక్షలో పోషకాలు 104 కేలరీలు, 1.1 గ్రాముల ప్రోటీన్, 0.2 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇందులో విటమిన్ కె, సి ఉన్నాయి. ఈ ద్రాక్ష క్యాన్సర్ (Cancer) కణాలను నివారిస్తుంది.
ఏ ద్రాక్షలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి?
రెండు రకాల ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.,కానీ నలుపు, ద్రాక్షలో మూడు రకాల పాలీఫెనాల్స్ ఉన్నాయి. ఫినోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్, రెస్వెరాట్రాల్. ఉపయోగపడతాయి. కాబట్టి నలుపు ద్రాక్ష, ఆకుపచ్చ ద్రాక్ష కంటే కొంచెం ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయని వైద్యులు సైతం చెబుతున్నారు.