Health

వరల్డ్ డాక్టర్స్ డే.. వారికి థ్యాంక్స్ చెప్పాల్సిందే!

వరల్డ్ డాక్టర్స్ డే.. వారికి థ్యాంక్స్ చెప్పాల్సిందే!

ప్రతి ఏటా మార్చి 30వ తేదీన వరల్డ్ డాక్టర్స్ డేను జరుపుకుంటారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించడంలో నిస్వార్థంగా వ్యవహరించిన వైద్యులకు నెటిజన్లు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గ్రామాల్లో ప్రాథమిక చికిత్స అందిస్తోన్న వైద్యుల సేవలను సైతం గుర్తుచేస్తూ వారికి థ్యాంక్స్ చెబుతున్నారు. సమాజంలో దైవంతో సమానంగా, చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడే మనుషులకు పునర్జన్మనిచ్చే వైద్యులకు సెల్యూట్.