చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ప్రారంభం :
ప్రత్యేక దర్శనాలు, అర్చన టిక్కెట్లు, హుండీల గొడవలు లేని ఆలయంగా చిలుకూరు బాలాజీ క్షేత్రం వినుతి కెక్కింది. దేవుని వద్ద అంతా సమానమే. ఆలయంలో భక్తుడు చూడవలసింది దైవాన్ని మాత్రమే. భగవంతునికి భక్తునికి మధ్య డబ్బు వ్యవహారం అవసరం లేదనే పద్ధతిని చిలుకూరు ఆలయం పాటిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని, అర్చకుల అభిమతాన్ని గౌరవించి రాష్ట్రప్రభుత్వం స్వయంప్రతిపత్తినిచ్చింది. చిలుకూరు స్వామిని వీసాల బాలాజీ అని కూడా పిలుస్తారు. అందువల్ల యువతకు ఆరాధ్య క్షేత్రమయ్యింది. మొదటిసారి ఈ దర్శించుకున్నప్పుడు 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటారు. కోర్కె తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. చిలుకూరులో ఏటా రెండుసార్లుచిలుకూరులో పూలంగి, అన్నకోట బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి తరువాతి రోజు అంటే చైత్ర మాసంలో పుష్యమి నక్షత్రంతో ఆరంభించి వారంరోజులపాటు పంచాహ్నిక దీక్షతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరం చైత్రమాస బ్రహ్మోత్సవాలకు మార్చి 31నాడు అంకురార్పణ జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా రాజ్యలక్ష్మీ సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం జరుగుతాయి. రోజూ వాహన సేవలుంటాయి. రోజూ ఉదయం 5 గంటలకు చిలుకూరు బాలాజీ ఆలయం తెరుస్తారు. సాయంత్రం గం. 7.45 వరకు నిరాఘాటంగా అందరూ ఉచిత దర్శనం చేసుకోవచ్చు.