Fashion

పాదాలకే కాదు చెప్పులకు కూడా నగలు వచ్చేశాయి!

పాదాలకే కాదు చెప్పులకు కూడా నగలు వచ్చేశాయి!

పాదాలకు నగలు సాధారణమే. కాలిజోళ్లకు మాత్రం కొత్త సంగతే. ‘సాండిల్స్‌ విత్‌ మెటల్‌ యాక్సెంట్‌ ( Sandals with Metal Accent )’ పేరిట లోహపు నగల సోకుతో పాదరక్షలు సరికొత్తగా మార్కెట్లోకి వస్తున్నాయి. వెండి పట్టీలకు పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌ అనిపిస్తూ.. అడుగులను అందంగా మారుస్తున్నాయి.

ఇంతకుముందు, ఎంత సంపన్నులకైనా ఒకటో రెండో జతల పాదరక్షలు ఉండేవి. ఏ దుస్తులు వేసుకున్నా చెప్పులు మాత్రం దాదాపు అవే కనిపించేవి. కాలం మారింది. చెప్పులు మారుతున్నాయి. ఫ్యాషన్‌లోనూ భాగం అవుతున్నాయి. ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌ నగలు అమ్మాయిల హాట్‌ ఫేవరెట్స్‌గా మారాయి. అలంకరణకు మ్యాచ్‌ అయ్యేలా, ఆడపిల్లల మనసును రీచ్‌ అయ్యేలా ఇప్పుడివి సిల్వర్‌ సోకుల్నీ అద్దుకుంటున్నాయి. పై భాగంలో నగిషీలు, మువ్వలు జోడించిన మెటాలిక్‌ బిళ్లలు వచ్చేలా పాదరక్షలు రూపొందుతున్నాయి. నలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో వస్తున్న చెప్పుల మీద నగల్లా మెరుస్తూ నలుగురినీ ఆకట్టుకుంటున్నాయీ సిల్వర్‌ సోకులు. బాందినీలాంటి ప్రింట్లతో రాజస్థానీ, కొల్హాపురి తరహా చెప్పులూ ఈ తరహాలో రూపొందుతున్నాయి. కాళ్లకు ధరించే వెండి పట్టీలకు చక్కని మ్యాచింగ్‌గా కనిపిస్తుండటంతో.. అమ్మాయిలు వీటిని ఎంచుకునేందుకు ముచ్చట పడుతున్నారు. ప్రముఖ ఆన్‌లైన్‌ సంస్థల వెబ్‌సైట్‌లలో ‘సాండిల్స్‌ విత్‌ సిల్వర్‌ యాక్సెంట్‌’ పేరిట ఇవి దొరుకుతున్నాయి.