స్విగ్గీలో 8,428 ప్లేట్లు ఆర్డర్ చేసిన హైదరాబాద్ వాసి
వ్యక్తి ఏడాదిలో ఏకంగా రూ. 6 లక్షలు ఖర్చు చేశారు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఆయన ఒక్కరే 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేశారు. గురువారం (మార్చి 30) ‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని’ పురస్కరించు కుని స్విగ్గీ ఈ అల్పాహార వంటకంపై తన వార్షిక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. గత మార్చి 30 నుంచి ఈ ఏడాది మార్చి 25 వరకు ఈ సంస్థ దేశవ్యాప్తంగా 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీలను డెలివరీ చేసిందట. ఇడ్లీలను ఆరగించడంలో బెంగళూరు వాసులు ముందున్నారని, ఆ తరు వాత హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోయంబ త్తూరు నగరాల్లో ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. పుణె, విశాఖపట్నంలలోనూ ఇడ్లీలకు బాగా డిమాండ్ ఉందని వెల్లడించింది. బెంగు ళూరు వాసులు రవ్వ ఇడ్లీని ఇష్టపడితే.. చెన్నైలో నెయ్యి ఇడ్లీ, హైదరాబాద్ వాసులు కారంపొడి నెయ్యి ఇడ్లీ, ముంబయి వాసులు ఇడ్లీ-వడను ఎక్కువగా తింటున్నారట.